Preity Zinta vs Congress: ప్రతీ జింతా సినీ,క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా తెలుగు వారికి కూడా బాగా పరిచయమే. తర్వాత హిందీలోనూ రాణించారు. ఆ తర్వాత ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేశారు. అందులో ఓ కీలక పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ టీమ్ మ్యాచులు జరిగినప్పుడు ప్రీతి జింతా హంగామా అందరూ చూస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెతో కూడా తిట్టించుకుంది. షేమ్ ఆన్ యూ అని కాంగ్రెస్ పై మండిపడింది. 

Continues below advertisement


అసలేం జరిగిదంటే.. ప్రీతి జింతా ఓ బ్యాంకులో పద్దెనిమది కోట్లు లోన్ తీసుకున్నారని.. ఆ బ్యాంక్ లోన్ ను మాఫీ చేశారని ఓ వార్తను చూపించిన కాంగ్రెస్ పార్టీ.. తన సోషల్ మీడియా అకౌంట్లను బీజేపీకి ప్రీతి జింతా ఇచ్చారని అందుకే లోన్ మాఫీ చేశారని ఆరోపించారు.  



దీనిపై ప్రీతి జింతా స్పందించారు. ఫేక్ న్యూస్ చూపించి తనపై నిందతులు వేస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లు తానే నిర్వహిస్తాన్నారు. ఆ లోన్ తీసుకుని.. మొత్తం చెల్లించేశానని అది జరిగి పదేళ్లు అయిందని స్పష్టం చేసింది.  



ప్రీతి జింతా రెస్పాన్స్ తో ఫ్యూజులు ఎగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ పద్దతిగా స్పందించింది. కానీ సారీ చెప్పలేదు.  





 అయితే ఈ ట్వీట్లు పెట్టింది.. ఏఐసీసీ సోషల్ మీడియా ఖాతాల నుంచి కాదు....కేరళ కాంగ్రెస్ పార్టీ విభాగం ట్విట్టర్ హ్యాండిల్ నుంచి .  కాంగ్రెస్ పార్టీ ఫేక్ న్యూస్ తో ప్రముఖులపై నిందలు వేసేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.