మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కేజిఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిమ్స్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా (NTR Neel Movie) రూపొందుతోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్స్ వేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత? ఆ కహాని ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...


స్పెషల్ సాంగ్ ఉంటుంది... అయితే!?
దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. యష్ హీరోగా ఆయన తీసిన 'కేజిఎఫ్'లో హిందీ వెర్షన్ సాంగ్ మౌని రాయ్ చేయగా... దక్షిణాది భాషల్లో మిల్కీ బ్యూటీ తమన్నా చేశారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమాలో స్పెషల్ సాంగ్ అంటూ ఏదీ లేదు. ఆ కథలో స్పెషల్ సాంగ్‌కు స్కోప్ లేదు.‌ అయితే... ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. అయితే దాని గురించి ఇప్పుడే మాట్లాడడం చాలా ఎర్లీ అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సాంగ్ ఉంటే ఊర్వశీ రౌతేలా చేయవచ్చు. లేదంటే మరొక అందాల భామ కూడా రావచ్చు. ఏదైనా జరగొచ్చు. 






హైదరాబాద్ సిటీలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే... హీరో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశారు. సెకండ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ ఉంటారా? లేదా? అనేది సందేహమే. ప్రస్తుతం దేవర జపనీస్ రిలీజ్ ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. జపాన్ దేశంలో మార్చి 28న దేవర విడుదల కానుంది. అందుకని, మార్చి 22వ తేదీన జపాన్ వెళ్లడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. మధ్యలో చేస్తే ఒక చిన్న షెడ్యూల్ చేయవచ్చు. అది సంగతి.


Also Read: సుమక్క వంటల షోలో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ప్రేమజంట... పృథ్వీ శెట్టి - విష్ణుప్రియ జోడీ ఈజ్ బ్యాక్



తెలుగులో ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్టుగా ఊర్వశి!
ఊర్వశి రౌతేలాకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జస్ట్ స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా ఆడియన్స్ అందరికీ ఆవిడ దగ్గర అవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన 'డాకు మహారాజ్' సినిమాలో ఆవిడ చేసిన స్పెషల్ సాంగ్ 'దబిడి దిబిడి...' విమర్శలతో పాటు వైరల్ అయింది. ఇక ఇటీవల ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరిగినప్పుడు స్టేడియంలో సందడి చేసింది ఊర్వశి. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్‌ను కలిసింది. దాంతో సుకుమార్ నెక్స్ట్ సినిమాలో ఆవిడ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. సుకుమార్ సినిమాలలో ప్రత్యేక గీతాలు ఎంత సూపర్ హిట్ అవుతాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని సుక్కుని తనకు ఒక్క సాంగ్ ఇవ్వమని ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఆ అవకాశాలను కొట్టి పారేయలేం.


Also Readసమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్