Darling Krishna's Kousalya Supraja Rama OTT Release On ETV Win: ఇటీవల పలు రీమేక్స్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన పలు కామెడీ, డ్రామా ఎంటర్‌టైనర్లు తెలుగులో ఓటీటీల్లోకి నేరుగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అలాంటి జానర్‌లోకి చెందిందే కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'కౌసల్య సుప్రజా రామ' (Kousalya Supraja Rama) మూవీ. రియలిస్టిక్ డ్రామాగా 2023, జులై 28న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.15 కోట్లు రాబట్టడం సహా.. ఐఎండీబీలోనూ 7.2 రేటింగ్ సాధించింది. ఆ ఏడాది కన్నడలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన నాలుగో మూవీగా నిలిచింది.


శశాంక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలానా నాగరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగులోనూ అదే పేరుతో నేరుగా ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో (ETV Win) ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'కౌసల్య సుప్రజా రామా ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో.. మనస్సును హత్తుకునే లవ్ స్టోరీ, పరివర్తన, తనను తాను తెలుసుకునే ఓ వ్యక్తి కథ మీ భాషలో..' అని పేర్కొంది.


Also Read: ఆశ్రమంలో అత్యాచారం, హత్యల వెనుక మిస్టరీ - బాబా బండారం బయటపడిందా?.. ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఎప్పటి నుంచంటే?






కథేంటంటే..?


లవ్, మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిసేలా ఈ మూవీని దర్శకుడు శశాంక్ రూపొందించారు. డార్లింగ్ కృష్ణ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక స్టోరీ విషయానికొస్తే.. ఆ ఊరిలో సిద్ధగౌడ (రంగాయన రఘు) స్త్రీలంటే చులకనగా చూస్తాడు. ఎప్పుడూ పురుషాధిక్య భావన కలిగి ఉంటాడు. మహిళలు ఇంటికే పరిమితం కావాలని.. మగవారికి సేవ చేయాలనే భావనతోనే ఉంటాడు. భార్య కౌసల్యపై (సుధ) అలాగే పెత్తనం చెలాయిస్తాడు. అతని కొడుకు రామ్ (డార్లింగ్ కృష్ణ) కూడా తండ్రి బాటలోనే నడుస్తాడు. ఈ క్రమంలోనే అతని లైఫ్‌లోకి శివానీ (బృంద ఆచార్య) వస్తుంది. రామ్ ఆమెను ప్రాణంగా ప్రేమిస్తుండగా.. మధ్యలోనే అతని బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ బాధలో ఉండగానే రామ్‌కు ముత్తులక్ష్మి (మిలానా నాగరాజ్)తో వివాహం జరుగుతుంది. ఆమె ద్వారా గతంలో తాను చేసిన తప్పులను తెలుసుకుని రామ్ రియలైజ్ అవుతాడు. మద్యానికి బానిసైన తన భార్యను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆడవాళ్ల గొప్పతనాన్ని రామ్ ఎలా అర్థం చేసుకున్నాడు.?, అతనిలో మార్పునకు కారణాలేంటి..? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. 


Also Read: 'దేవర' కోసం జపనీస్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు... త్వరలో జపాన్‌ ప్రయాణం కూడా!