Roja: బుల్లితెరపై రోజా రీ ఎంట్రీ - చాలా రోజుల తర్వాత ఆ షోలో జడ్జీగా మాజీ మంత్రి, ప్రోమో చూశారా?

Zee Telugu Championship: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా చాలా రోజుల గ్యాప్ తర్వాత బుల్లితెరపైకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. జీ తెలుగు 'సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్'లో ఆమె జడ్జీగా రానున్నారు.

Continues below advertisement

Roja Re Entry To TV As A Judge In Zee Telugu Serial Super Championship: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్, ఏపీ మాజీ మంత్రి రోజా (Roja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు టీవీ షోల్లోనూ జడ్జిగా చేశారు. మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్ వంటి షోలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి ప్రజా సేవలో ఉంటూనే ఇటు ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్‌'లో జడ్జిగా వ్యవహరించారు. ఇదే సమయంలో పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. పాలిటిక్స్‌లో రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆమెకు మంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. దీంతో ఇక బుల్లితెరకు దూరంగా ఉంటూ.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు.

Continues below advertisement

మళ్లీ బుల్లితెరపైకి రీ ఎంట్రీ

2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆమె పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ కొంత సోషల్ మీడియాలో టీడీపీని విమర్శిస్తున్నా అంతకు ముందున్నంత యాక్టివ్‌గా లేరనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. తాజాగా.. ఆమె మళ్లీ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగు 'సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్' (Super Serial Championship) సీజన్ 4లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. రోజాతో పాటు స్టార్ హీరో శ్రీకాంత్, సీనియర్ హీరోయిన్ రాశి ఈ షోలో జడ్డీలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ షో మార్చి 2న సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. 

Also Read: తెలుగులో 'డ్రాగన్' హీరోయిన్ కయాదుకు గోల్డెన్ ఛాన్స్... యంగ్ హీరోతో, సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లో

Continues below advertisement