విష్ణు ప్రియా భీమనేని (Vishnupriya Bhimeneni) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పోరా పోవే' కార్యక్రమానికి యాంకరింగ్ చేయడంతో పాటు 'పటాస్', 'జబర్దస్త్', 'శ్రీ దేవి డ్రామా కంపెనీ' వంటి పలు షోలు చేశారు. కన్నడ కుర్రాడు పృథ్వీ శెట్టి కూడా సీరియళ్ల ద్వారా తెలుగు ప్రజలకు దగ్గర అయ్యాడు. అయితే వీళ్ళిద్దరి పేర్లు చెబితే గుర్తుకు వచ్చేది 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8'.


ఆహా... సుమక్క వంటల షోలో మళ్లీ జంటగా
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8లో అటు విష్ణు, ఇటు పృథ్వీ... ఇద్దరూ టైటిల్ నెగ్గలేదు. కనీసం రన్నరప్ కూడా కాలేదు. అయితే... బిగ్ బాస్ ఇంటిలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది. పృథ్వీ శెట్టికి కొంచెం దూరంగా ఉండమని, అతడి మీద చూపించే ఇంట్రెస్ట్ వల్ల గేమ్ సరిగా ఆడటం లేదని విష్ణుకు ఆవిడ ఫ్రెండ్స్ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ షో ముగిసింది. కట్ చేస్తే... ఇప్పుడు కొత్త షోలో వీళ్ళిద్దరూ అడుగు పెట్టారు. 


ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్టుగా ఆహా ఓటీటీ 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె' అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో విష్ణు ప్రియా భీమనేని, పృథ్వీ శెట్టి జంటగా సందడి చేయనున్నారు. ఓటీటీ ఆడియన్స్ అందరికీ వినోదం పంచనున్నారు. విష్ణు - పృథ్వీతో పాటు మరో నాలుగు జంటలు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నాయి. వాళ్ళ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.


Also Read'దేవర' కోసం జపనీస్ మీడియాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు... త్వరలో జపాన్‌ ప్రయాణం కూడా!






గురువారం, మార్చి 6... సాయంత్రం 7 గంటలకు!
Chef Mantra Project K first episode streaming date and time: 'షెఫ్ మంత - ప్రాజెక్ట్ కె' ఫస్ట్ ఎపిసోడ్ మార్చి మొదటి వారంలో 6వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు స్ట్రీమింగ్ కానుంది. సెలబ్రిటీ జంటలు ఎవరెవరు ఏయే వంటలు చేస్తారో చూడాలి.


సుమ కనకాల షో హోస్ట్ అని, ఇదొక వంటల ప్రోగ్రాం అని చెప్పకుండా 'CMPK' అని ఆహా అనౌన్స్ చేసింది. దాంతో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ (ముఖ్యమంత్రి) అని, పీకే అంటే పవన్ కళ్యాణ్ అని జనాలు అనుకున్నారు. కట్ చేస్తే... ట్విస్ట్ ఇచ్చారు. 


Also Readసమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్