UAN Activation Deadline Extends: 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO)కు సంబంధించి ఈ మధ్యకాలంలో తరచూ పెద్ద వార్తలు వింటున్నాం. ఈ కోవలో, తాజాగా మరో న్యూస్‌ బయటకు వచ్చింది, అది EPFO మెంబర్లకు శుభవార్త అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ప్రయోజనాలు పొందడానికి 'యూనివర్సల్ అకౌంట్ నంబర్' (UAN)ను యాక్టివేట్ చేసేందుకు & బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి, ఈ గడువును గతంలో చాలా సార్లు పొడిగించారు, ఇప్పుడు మరో అవకాశం ఇచ్చారు.

UAN-ఆధార్ లింక్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న గడువు 15 ఫిబ్రవరి 2025తో ముగిసింది. దీనిని 15 మార్చి 2025 వరకు ప్రభుత్వం పెంచింది. దీంతో, ఈపీఎఫ్‌వో ఖాతాదార్లకు మరో నెల రోజుల అదనపు సమయం లభించింది.

గడువు పొడిగింపుపై, కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ 21 ఫిబ్రవరి 2025న ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. "సంబంధిత అధికార సంస్థ, UAN యాక్టివేషన్ & బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడానికి కాల పరిమితిని మార్చి 15, 2025 వరకు పొడిగించింది" అని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.

UAN అంటే ఏమిటి?ప్రతి ఒక్క సభ్యుడికి EPFO జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య UAN (Universal Account Number). ఉద్యోగులు తమ మొత్తం కెరీర్ మొత్తంలో వివిధ కంపెనీల్లో పని చేసినప్పటికీ, ఒకే PF ఖాతా నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా, ఒక ఉద్యోగి ఎన్ని కంపెనీలు మారినప్పటికీ, తన ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ఒకే నంబర్‌ ద్వారా ట్రాక్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి వీలవుతుంది.

ELI పథకానికి UAN యాక్టివేషన్ అవసరమా?ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద నగదు ప్రయోజనాలు పొందడానికి ఉద్యోగులు తమ UAN యాక్టివేట్ చేసుకోవడం & బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. "ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం ప్రయోజనాలు పొందడానికి మీ బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఈ పని పూర్తి చేయండి" అని సూచిస్తూ, EPFO తన X హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. 

ELI పథకంలో మూడు వెర్షన్లు2024 జులైలో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ELI పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో మూడు వెర్షన్లు ఉన్నాయి.         

స్కీమ్‌ A- మొదటి ఉద్యోగం చేస్తున్న & EPF పథకానికి చందా కడుతున్నవారిపై ఇది దృష్టి పెడుతుంది.        

స్కీమ్‌ B- తయారీ రంగంలో ఉపాధి కల్పనపై ఇది దృష్టి పెడుతుంది.     

స్కీమ్‌ C- కంపెనీ యాజమాన్యాల కోసం దీనిని రూపొందించారు, యాజమాన్యాలకు ఇది మద్దతు ఇస్తుంది.            

మరో ఆసక్తికర కథనం: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై ఎంత వడ్డీ చెల్లిస్తారు?, ఈ వారంలోనే నిర్ణయం