Congress is likely to win ten Lok Sabha seats in Telangana  :  తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  పది స్థానాలు గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన ఏబీపీ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడయింది. బీజేపీకి నాలుగు లోక్ సభ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. 


ABP C-voter తెలంగాణలో హస్తం హవా
సీట్ల షేరింగ్ 
కాంగ్రెస్ (UPA) -  10
బీజేపీ  (NDA)-      4
బీఆర్ఎస్ (BRS)     2


 





 


ఇక  ఓటింగ్ విషయంలోనూ కాంగ్రెస్ ముందడుగు వేసింది. కాంగ్రెస్ పార్టీ 42.9 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని పోల్‌లో వెల్లడయింది. 28.4 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు ఓటు వేస్తారు. బీజేపీకి 25.11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయినా బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఓట్ల బలం కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటమే కారణం అని అంచనా వేస్తున్నారు. 


ABP C-voter తెలంగాణలో హస్తం హవా
కాంగ్రెస్ (UPA) -  42.9%
బీజేపీ  (NDA)-      25.1%
బీఆర్ఎస్ (BRS)     28.4%


 





ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటికి విజయం సాధించబోతున్నట్లుగా ఒపీనియన్ పోల్ తేల్చింది. 


 


[Disclaimer: Current survey findings and projections are based on CVoter Opinion Poll Computer Assisted Telephone Interview (CATI) conducted among 41,762 adults, all confirmed voters. The surveys were conducted from February 1 to March 10, 2024. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. The final data has socio-economic profiles within +/- 1% of the demographic profile of the states. We believe this will give the closest possible trends. The sample spread is across all 543 electoral constituencies in the country. The margin of error is +/- 5% and the vote share projections have been done with 95% confidence interval.]