TG Number Plate: రేపటి (మార్చి 15) నుంచి తెలంగాణలోని వాహనాలు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ గా మార్చేందుకు నిర్ణయాన్ని తీసుకుందని మంత్రి చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో టీజీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి వినతి పంపామని.. కేంద్ర ప్రభుత్వం నేడు టీజీగా మార్చుకునేందుకు ఆమోదం తెలిపిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 


వరంగల్ లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు ఏపీకి బదులు టీజీగా రాసుకున్నారని. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా టీఎస్ గా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం టీజీగా నిర్ణయం తీసుకుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని అన్నారు. కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం, సంస్థ కృషి చేస్తుందని పొన్నం చెప్పారు.