Supreme Court on Contract Teachers: కాంట్రాక్ట్ టీచర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఎంత మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారో అఫిడవిట్‌ల రూపంలో  అన్ని రాష్ట్రాలు కోర్టుకి వెల్లడించాలని తేల్చి చెప్పింది. కాంట్రాక్ట్‌ బేసిస్‌లో పని చేస్తూ Rehabilitation Council of India ద్వారా శిక్షణ పొందిన వాళ్లు ఎంత మంది ఉన్నారో చెప్పాలని స్పష్టం చేసింది. వాళ్లలో ఎంత మందిని అపాయింట్‌ చేసేందుకు అవకాశముందో స్పష్టంగా చెప్పాలని తెలిపింది. రెగ్యులరైజ్ చేసేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే..ఆ అఫిడవిట్‌లలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యతో పాటు మరి కొన్ని వివరాలూ వెల్లడించాలని చెప్పింది. వాళ్ల పే స్కేల్ లేదా నెలవారీ అందిస్తున్న వేతన వివరాలు అందులో ప్రస్తావించాలని తెలిపింది. ఎన్నేళ్లుగా వాళ్లు కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారో కూడా చెప్పాలని స్పష్టం చేసింది. వాళ్ల సర్వీస్‌ని రెగ్యులరైజ్ చేసేందుకు అర్హత ఉందో లేదో కూడా వివరించాలని చెప్పింది. మరో నాలుగు వారాల్లోగా ఈ అఫిడవిట్‌లు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో ఎంత మందిని రెగ్యులరైజ్ చేశారు..? ఒకవేళ ఆ సంఖ్య తక్కువగా ఉంటే ఇకపై ఆ సంఖ్యని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా ఆ అఫిడవిట్‌లో ప్రస్తావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ 28వ తేదీనే సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన తీర్పునిచ్చింది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మరో నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌లు సమర్పించాలని ఇప్పుడు మరోసారి తేల్చి చెప్పింది. 


సుప్రీంకోర్టు మార్గదర్శకాలివే..


1. ప్రత్యేక పాఠశాలల్లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత ఉందో చెప్పాలి. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారో వెల్లడించాలి. 


2. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలో చెప్పాలి. ఆ మేరకు పర్మినెంట్ పోస్ట్‌లు కల్పించాలి.