ABP Southern Rising summit 2023:  భారత దేశంలో దక్షిణాది రాష్ట్రాది ఓ ప్రత్యేకమైన స్థానం. పురోగామి రాష్ట్రాలుక దేశం మొత్తం పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. భాషలు కూడా వేర్వేరు. రాజకీయంగానూ భిన్నమైన పంథాలతో వెళ్తూంటాయి. దేశ రాజకీయాలన్నీ ఓ దిశగా వెళ్తూంటే దక్షిణాది ప్రజలు మరింత భిన్నంగా ఆలోచిస్తారు. ప్రాంతీయతే పెద్ద పీటవేస్తారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఏకాభిప్రాయానికి రావడానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఓ కారణం.

  






దేశంలో తలసి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉంటాయి. తలసరి ఆదాయంలో టాప్‌-5 స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాలే ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ర్టాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. జనాభాను నియంత్రించాలన్న పిలుపునకు ఈ రాష్ట్రాలు అద్భుతంగా స్పందించాయి. మంచి ఫలితాలు సాధించాయి. ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసినా ప్రపంచం మొత్తం వాటి గురించి మాట్లాడేలా చేయడంలో  దక్షిణాది చిత్ర పరిశ్రమలు అనూహ్య విజయాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు  బాలీవుడ్‌కు బ్లాక్  బస్టర్లు అందిస్తోంది కూడా దక్షిణాది టెక్నిషియన్సే అంటే.. ఎంతగా చొచ్చుకు వచ్చేశారో అర్థం చేసుకోవచ్చు. 


దక్షిణాదిన మూడు మెట్రో నగరాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. దేశంలో అత్యధిక మంది యువతకు ఈ నగరాలు  డ్రీమ్ సిటీస్. అవకాశాల గనులు. ఈ అంచనాలను ఈ నగరాలు అంతకంతకూ పెంచుకుంటున్నాయి..ఆశలు నెరవేరుస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా మారాయి.  ఐదు దక్షిణాది రాష్ట్రాల ఒకటే లక్ష్యం..దేశాన్ని ముందుండి నడపడం.


 దక్షిణాది రాష్ట్రాల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. తమ హక్కులను కాపాడుకోవడానికి గళమెత్తడంలోనూ ఎప్పుడూ  వెనుకడుగు వేయని నైజం దక్షిణాది రాష్ట్రాలది. ఇటీవల దక్షిణాది ఎక్కువగా స్పందిస్తున్న అంశం పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ విషయంలో.. అన్యాయం జరగుకుండా చూడాలని వాదించడం. అలాగే హిందీ భాష .. ఇతర అంశాల పై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు ఘాటుగానే వెల్లడిస్తూ ఉంటారు. అందకే దక్షిణాది ఆలోచనల్ని.. దేశం ముందు ఉంచడానికి శతబ్దానికిపైగా ఘన చరిత ఉన్న ఏబీపీ నెట్ వర్క్.. ఏబీపీ సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023ని చెన్నైలో నిర్వహిస్తోంది. అక్టోబర్ 12వ తేదీన ఉదయం పది గంటలకు చెన్నైలోని తాజ్ కోరమాండల్‌లో సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 ప్రారంభమవుతుంది. 




తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉదయనిధి స్టాలిన్, దగ్గుబాటి రాణా, కల్వకుంట్ల కవిత, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎంవీ రాజీవ్ గౌడ, కుష్భూసుందర్ ,సుహాసిని మణిరత్నం సహా దక్షిణాది రాష్ట్రాలకు చెంది.. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు ప్రముఖులు సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. దేశ పురోభివృద్ధిలో దక్షిణాది పోషించిన.. పోషించబోయే పాత్ర.. ఎుదరయ్యే సవాళ్లు వంటి వాటిపై మనోభావాలను ఆవిష్కరించనున్నారు. 


దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల అభివృద్ధిని గుర్తించి.. దక్షిణ భారతదేశ దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకుగానూ ABP నెట్ వర్క్ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. పాలిటిక్స్, బిజినెస్, విద్యాసంస్థలు, సంగీతం, కళలు తదిదర రంగాలకు చెందిన ప్రముఖులు 'న్యూ ఇండియా', రాజకీయాల్లో మహిళల పాత్ర, వైవిధ్యం మరియు రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలపై తమ అభిప్రాయాలను ఈ వేదికగా పంచుకుంటారు.


అక్టోబర్ 12వ తేదీన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ షెడ్యూల్ ఇదే






The summit will take place at Taj Coromandel, Chennai, and will be streamed LIVE on news.abplive.comabpnadu.com, and abpdesam.com.