Delh Couple romancing while riding a bike : చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంది.. వెనుక అమ్మాయి ఉంది .. లాంగ్ రైడ్ కి వెళ్తే ఎంత మజా ఉంటుందని కొంత మంది రొమాంటిక్‌గా పాడుకుంటూ ఉంటారేమో కానీ మరికొంత మంది మాత్రం హద్దులు దాటిపోతూంటారు. అలాంటి జంట ఒకటి ఢిల్లీలో సోషల్ మీడియా కెమెరాలకు చిక్కింది. 


ఢిల్లీలోని చాందినీచౌక్ , వికాస్ పురి ఫ్లైఓవర్ పై ఓ జంట బైక్ పై వెళ్తూ ఫుల్ రొమాన్స్ లో మునిగితేలిపోయారు. యువకుడు స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే.. ఆ యువతి వెనుక కూర్చోకుండా ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒళ్లో కూర్చుకుంది. అంతేనా ఆ వ్యక్తి మెడపై చేతులు వేసి హగ్గులు ఇస్తూ ముద్దులు పెట్టేస్తోంది. మధ్యమధ్యలో అతడు కూడా డ్రైవింగ్ మీద కాన్సన్ ట్రేట్ తగ్గించి అదే పని చేస్తున్నాడు. దీన్ని ఆ దారిన పోయే వాళ్లంతా వీడియోలు తీశారు. అయితే మరో లోకంలో ఉన్న వారు ..  తాము మరి అతి చేస్తున్నామని  గుర్తించలేకపోయారు. 


'బుల్డోజర్ న్యాయం'పై సుప్రీంకోర్టు కీలక తీర్పు - అప్పటివరకూ కొంపలేం మునిగిపోవంటూ వ్యాఖ్యలు


ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బైక్ నెంబర్ తో సహా వీడియోలు ఉండటంతో ఆ అమ్మాయి, అబ్బాయి ఎవరో అందరికీ తెలిసిపోయింది.  



నెటిజన్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ప్రమాదం జరిగితే.. వచ్చే నష్టమేమీ  లేదని కానీ వీరి వల్ల మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని అంటున్నారు.వీరి తీరును సమర్థించేవారు ఒక్కరి కూడా లేరు.   





ఇలాంటి వారు రోడ్ పై రాకుండా..  వెంటనే వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇప్పించాలని  మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.