Today Top Headlines In AP And Telangana:
కులగణనకు తెలంగాణ మార్గదర్శి - కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో చేపట్టిన కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో తెలంగాణ సీఎం చిట్ చాట్ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని వివరించారు. సభలో ప్రవేశపెట్టే డాక్యుమెంట్ భవిష్యత్‌లో ఎపుడైనా రిఫరెన్స్ డాక్యుమెంట్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విమానాలపై రాజ్యసభలో సుధామూర్తి Vs రామ్మోహన్
దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏవియేషన్ కాలేజీలతోపాటు విజయపురకు విమానాలు ఎప్పుడు వస్తాయని రాజ్యసభలో సుధామూర్తి ప్రశ్నించారు. కచ్చితమైన సమాధానం చెప్పాలని మంత్రిని అడిగారు. ఆమె అడిగింది తిరుపతికి సంబంధించిన విషయమని కానీ విజయపుర పేరు ప్రస్తావించారని అన్నారు. అక్కడికి త్వరలోనే విమానాలు వస్తాయని తెలిపారు. లిఖితపూర్వక సమాధాం ఇస్తామని కూడా కూలంకుషంగా వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు తీర్పు వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వారికి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పది మంది ఎమ్మెల్యేలకే కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు సమయం కావాలని కోరారు. ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి పదిన విచారణ జరగనుంది. ఈలోపే ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హైడ్రామా
తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంది. టీడీపీకి చెందిన ఏకైక కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ మంగళవారం జరిగిన ఎన్నికల్లో తిరుపతి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తిరుపతి నగర కార్పొరేషన్‌లో సంఖ్యాపరంగా వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు మారిపోయాయి. అయితే ఇక్కడ వైసీపీకి ఓటు వేసిన కొందరు ఆ పార్టీ కార్పొరేటర్లు భూమన ఇంటికెళ్లడం చర్చనీయాంశమైంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధానమంత్రి లేఖ
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ మృతిపై సంతాపం తెలియజేస్తూ సందేసంపంపించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. సకలమ్మ మరణానికి చింతిస్తున్నానని ఆ లేఖ సందేశం. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి