Telangana MLAs News | హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నాడు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి ఆ ఎమ్మెల్యేలకు నేడు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమయం కావాలని కోరారు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10న విచారించనుంది.

ఎమ్మెల్యేలకు నోటీసులతో బీఆర్ఎస్ అలర్ట్..

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. శాసన సభలో పార్టీ విప్ గా కెపీ వివేకానంద గౌడ్ ను, శాసనమండలిలో పార్టీ విప్‌గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు స్పీకర్ ను అధినేత ప్రకటనను అందజేశారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను, శాసనమండలి చైర్మన్ లను విప్‌లు కోరారు.

Also Read: Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం