Prabhas Hanu Raghavapudi Movie: 'ఫౌజీ' షూటింగ్ రీస్టార్ట్, గాయమైనా తగ్గని ప్రభాస్... బ్రేక్ లేకుండా కొత్త షెడ్యూల్ ప్లాన్
Prabahas - Hanu Movie Update : 'ఫౌజీ' యాక్షన్ సీక్వెన్స్ లో అయిన గాయం కారణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ప్రభాస్, ఇప్పుడు షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు.

Prabhas Latest News: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసింది. గత ఏడాది 'కల్కి 2898 ఏడీ'లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' అనే సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ 'ఫౌజీ' మూవీ షూటింగ్లో గాయపడ్డట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కాలికైన గాయం కారణంగా ప్రభాస్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గాయం నుంచి కోలుకొని, త్వరలోనే 'ఫౌజీ' కొత్త షెడ్యూల్ను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
'ఫౌజీ' కొత్త షెడ్యూల్ ప్లాన్ ఇదే
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజాసాబ్' మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడితో సినిమాను ఇప్పటికే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి 30 రోజుల షూటింగ్ పూర్తయింది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కీలక పార్ట్ షూటింగ్ అంతా కారైకుడి, హైదరాబాద్ సిటీలలో జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 5న హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్లో ఎలాంటి గ్యాప్, బ్రేక్ లేకుండా ప్లాన్ చేశారు 'ఫౌజీ' మేకర్స్. ఈ మూవీ షూటింగ్ లో అయిన గాయం కారణంగానే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ జపాన్ ప్రమోషన్లలో కూడా పాల్గొనలేకపోయారు.
ఇక ఇప్పుడు మాత్రం ఫిబ్రవరిలో 'ఫౌజీ' కొత్త షెడ్యూల్ మొదలుపెడితే మార్చ్ చివరి వరకు కంటిన్యూస్ గా షూటింగ్ కొనసాగుతుందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో, ఇకనైనా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, సమ్మర్ సందర్భంగా డార్లింగ్ అభిమానులకు ట్రీట్ ఇచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రభాస్ కూడా గాయం నుంచి కోలుకోవడంతో, తిరిగి సెట్స్ లో కాలు పెట్టబోతున్నారు. మరోవైపు 'ది రాజా సాబ్' సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.
నెక్స్ట్ టార్గెట్ 'స్పిరిట్'
ఇక ప్రభాస్ చేతిలో ఉన్న మోస్ట్ అవైటింగ్ సినిమాలలో 'స్పిరిట్' కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో దశలో ఉంది. 'ది రాజా సాబ్', షూటింగ్ తో పాటు హను రాఘవపూడి మూవీ షూటింగ్ పూర్తి చేశాక, ప్రభాస్ 'స్పిరిట్'ను మొదలు పెట్టబోతున్నారు. ఈ ఏడాది మేలో 'స్పిరిట్' సినిమా షూటింగ్ను మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 2025 చివర్లోగా 'స్పిరిట్' మూవీ షూటింగ్ పూర్తవుతుందని, 2026 మొదట్లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు స్పెషల్ లుక్ మైంటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, కాస్త టైం తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.