20th CPC National Congress:


నేషనల్ కాంగ్రెస్ మీటింగ్..


చైనాలో Communist Party of China (CPC) 20వ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్‌ మొదలైంది. బీజింగ్‌లోని  Great Hall of the Peopleలో ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారికంగా ప్రారంభించారు. దీనికి చైనా మిలిటరీ కమాండర్ ఒకరు హాజరయ్యారు. ఆయన మరెవరో కాదు. 2020లో గల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన సమయంలో గాయపడ్డ కమాండర్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)లోని 304 మంది సభ్యుల్లో క్వి ఫబావ్‌ ఒకరు.People’s Armed Police కూడా ఈ మీటింగ్‌కు హాజరైంది. 
మొత్తం 2,300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో జిన్‌ పింగ్ కీలక ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే గల్వాన్‌ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. అక్కడే ఓ తెరపై అప్పటి గొడవకు సంబంధించిన వీడియోనూ ప్రదర్శించారు. సీపీసీ సాధించిన విజయాల్లో ఇదీ ఒకటని చాలా గర్వంగా చెప్పుకుంది చైనా. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో ఇది. ఇప్పుడు దీన్నే చూపిస్తూ...తమ విజయంగా చెప్పుకుంది చైనా. గ్రేట్ ఆడిటోరియంలో ప్రదర్శించి..వేలాది మంది ప్రతినిధులు ఆ వీడియోను చూశారు. దీని తరవాతే జిన్ పింగ్ప్ర సంగించారు. 


ఆర్మీకి హైటెక్ ట్రైనింగ్..


"చైనా మిలిటరీ ట్రైనింగ్‌ను ఇంకా కఠినతరం చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనై సైన్యం ఎదురు నిలిచేలా తీర్చి దిద్దుతుంది. హైటెక్ ట్రైనింగ్‌ కూడా అందిస్తాం" అని స్పష్టం చేశారు జిన్‌పింగ్. "ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ సైన్యాన్ని మోహరిస్తూనే ఉంటాం. మా దేశ భద్రతకు ఇది అవసరం. ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొంటాం. యుద్ధం జరిగినా అందుకు సిద్ధం" అని పరోక్ష హెచ్చరికలు చేశారు. భారత్ పేరు ప్రస్తావించకపోయినా.."యుద్ధానికి సిద్ధం" అని వ్యాఖ్యలు చేయటమూ చర్చకు దారి తీసింది. గల్వాన్ ఘటన వీడియోని ప్రదర్శించిన తరవాత జిన్‌పింగ్ ఇలా మాట్లాడటం...ఆయన హెచ్చరికలు చేసింది భారత్‌కేనన్న స్పష్టతనైతే ఇస్తోంది. 


ఇదీ జరిగింది..


లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్- చైనా దేశాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. రెండు దేశాల సైనికులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే, దీనికి నెల రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2020 మే 21న భారత సైన్యం సరిహద్దులు దాటుతోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కూడా స్పందించారు. రోజువారీగా భారత్ చేపట్టే గస్తీ విధులకు చైనా సైన్యమే అడ్డు తగిలిందని అనురాగ్ చెప్పారు. 2020 జూన్ 6న లద్దాఖ్‌లో భారత్, చైనా దౌత్యవేత్తలు, సైనిక కమాండర్లు ఈ విషయంపై చర్చలు జరిపారు. ఆ తర్వాత పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ చర్చలు జరిపారు.


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా దాడి, డ్రోన్స్‌తో అటాక్ చేసిన సైన్యం