సినిమా రివ్యూ: ది వారియర్
రేటింగ్: 2.5/5
నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షరా గౌడ, లాల్, నదియా, బ్రహ్మాజీ, అజయ్, జయప్రకాశ్, రిడిన్ కింగ్ స్లే తదితరులుమాటలు: సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సమర్పణ: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి
విడుదల తేదీ: జూలై 14, 2022
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేసిన సినిమా 'ది వారియర్' (The Warriorr Movie). లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రామ్ తమిళ తెరకు పరిచయం అవుతున్నారు. డీసీపీ సత్య పాత్రలో రామ్ గెటప్, ట్రైలర్, పాటల్లో కృతి శెట్టితో వేసిన స్టెప్పులు సినిమాపై అంచనాలు కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది (Warrior Telugu Movie Review)?
కథ (The Warriorr Movie Story) : సత్య (రామ్ పోతినేని) డాక్టర్. ఎంబీబీఎస్ పూర్తి చేశాక... హౌస్ సర్జన్ చేయడం కోసం కర్నూల్ వెళతాడు. రోడ్డు మీద ఒక అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే... ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడతాడు. గురు (ఆది పినిశెట్టి) మనుషులు ఆసుపత్రికి వచ్చి మరీ చంపేస్తారు. దాంతో గురు మీద పోలీసులకు ఫిర్యాదు ఇస్తాడు. కర్నూల్ అంతా సత్య పేరు వినబడుతుంది. కొండారెడ్డి బురుజు దగ్గర సత్యను గురు చావ కొడతాడు. సత్య ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టడు. రెండేళ్ల తర్వాత ఏ కర్నూల్ నుంచి అయితే చావు దెబ్బలతో వెళ్ళాడో? అదే కర్నూల్‌కు డీసీపీగా వస్తాడు. వచ్చిన తర్వాత గురును ఏం చేశాడు? సత్య జీవితంలో ఆర్జే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి), తల్లి (నదియా) పాత్ర ఏమిటి? అనేది థియేటర్లలో చూడాలి.
విశ్లేషణ(The Warriorr Review) : ది వారియర్... పక్కా కమర్షియల్ చిత్రమిది. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా. కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. రెగ్యులర్‌గా అనిపిస్తుంది. ఈ కథలో వచ్చే ట్విస్టులు ఊహించడం కూడా పెద్ద కష్టం ఏమీ కాదు. రొటీన్ కథ, స్క్రీన్ ప్లేను యాక్షన్ ఎపిసోడ్స్, హీరో విలన్ మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా కాస్త మార్చాయి.
'ది వారియర్' ఫస్టాఫ్ చూస్తే కూల్ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు ఖాకి కథ మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా రామ్, కృతి మధ్య సీన్స్ పర్లేదు. అలా అలా వెళుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు సులభంగా ఊహించవచ్చు. అయితే... రెండున్నర గంటల సినిమా అయినప్పటికీ నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ సీన్స్ కొన్ని ట్రిమ్ చేసి... సీన్స్ పరుగులు పెట్టిస్తే ఇంకా బాగుండేది. హీరో పోలీస్ అయితే... ప్రేక్షకులు పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సినిమాలో ఆ స్థాయిలో డైలాగ్స్ లేవు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకుంటే బావుండేది. పోసాని కామెడీ సీన్ నవ్విస్తుంది. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ క్యూట్‌గా ఉంది. ప్రాణం విలువ తెలియని వాళ్ళకు ఆ విలువ తెలియజేయాలని ఒక డాక్టర్ పోలీస్ కావడం అనే కాన్సెప్ట్ బావుంది. కానీ, దాన్ని ఇంకా బాగా డీల్ చేసి ఉండాల్సింది.
'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్ సినిమా విడుదలకు ముందు బాగా వినిపించాయి. స్క్రీన్ మీద ఆ రెండు పాటలను గ్రాండ్‌గా పిక్చరైజ్ చేశారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఓకే. 'జననం' అంటూ వచ్చే నేపథ్య గీతం ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ చక్కటి నేపథ్య సంగీతం అందించారు. మిగతా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఫీల్ తీసుకొచ్చింది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపించింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు?: 'ది వారియర్'కు రామ్, ఆది పినిశెట్టి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఇద్దరూ పాత్రలకు న్యాయం చేశారు. చక్కటి నటన కనబరిచారు. సత్య పాత్రలో రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. రామ్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ సాంగ్స్ పడితే చాలు ఎప్పుడూ హుషారుగా డ్యాన్సులు చేస్తారు. ఈసారీ సాంగ్స్‌లో డ్యాన్స్ ఇరగదీశారు. 'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్‌లో డ్యాన్సులు బాగా చేశారు. పక్కా మాస్ ఫైట్స్ పడటంతో కుమ్మేశారు. సాంగ్స్, ఫైట్స్ పక్కన పెడితే... రామ్ ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి.
రామ్ క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్టాఫ్‌లో డాక్టర్‌గా కనిపిస్తే... ఇంటర్వెల్ ముందు నుంచి పోలీస్‌గా కనిపిస్తారు. డాక్టర్‌గా ఆయన గెటప్, యాక్టింగ్ క్లాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే... పోలీస్ గెటప్, నటన మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. రెండు లుక్స్‌లో బావున్నారు. పోలీస్‌గా ఫైట్స్ చేసేటప్పుడు ఒక ఇంటెన్స్ మైంటైన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌లో రామ్, ఆది మధ్య ఫైట్ బావుంది. రామ్ తర్వాత ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) గురించి మాట్లాడుకోవాలి. గురు పాత్రలో సెటిల్డ్ విలనిజం చూపించారు. కర్నూల్ యాసలో డైలాగులు చెప్పారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ సూపర్. నటన పరంగా, అందం విషయంలోనూ కృతి శెట్టి పాత్రకు న్యాయం చేశారు. కృతి లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. అయితే... ఆమె పాత్రకు కథలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హీరో లవ్ ఇంట్రెస్ట్ అంతే! క్లైమాక్స్‌కు ముందు ఒక ఎమోషనల్ సీన్‌లో ఆమెకు ఇంపార్టెన్స్ లభించింది. పోసాని కృష్ణమురళి, నదియా, అజయ్, జయప్రకాశ్, 'ఛత్రపతి' శేఖర్ తదితరుల పాత్రలు రొటీన్. కమర్షియల్ ఫార్మాట్‌లో నడిచే కథలో వాళ్ళ పాత్రలు అలా సెట్ అయ్యాయి.
Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?
చివరగా చెప్పేది ఏంటంటే?: 'ది వారియర్' గురించి చెప్పాలంటే... కమర్షియల్ ఫీల్ ఇచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్. రామ్, ఆది పినిశెట్టి నటన... కృతి శెట్టి గ్లామర్... మూడు సాంగ్స్... యాక్షన్ ఎపిసోడ్స్... బావున్నాయి. లెంగ్త్ ఎక్కువైంది. అందువల్ల, సెకండాఫ్ స్లోగా ఉంటుంది. దర్శకుడిగా ఒకప్పటి లింగుస్వామి కనిపించలేదు. ఈ సినిమాకు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే హ్యాపీగా టైమ్‌పాస్ చేయవచ్చు. 'ది వారియర్'... కమర్షియల్ సినిమా ప్రేమికుల కోసం!
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?