గుడి నుంచి జ్ఞానంబ వాళ్ళు ఇంటికి వస్తారు. జ్ఞానంబ జానకి దగ్గరకి వచ్చి మీ మనసులు కలిశాయ మీ మధ్య అన్యోన్యత పెరిగిందా అని అడగ్గా అవును అన్నట్టు సమాధానం ఇస్తుంది. త్వరలోనే నీ కడుపు పండాలి అని జ్ఞానంబ సంతోషంగా వెళ్ళిపోతుంది. అదంతా మల్లిక విని నా ఐదు సెంట్ల స్థలం పోయినట్టే అని ఏడుస్తుంది. ఇక జ్ఞానంబ మల్లిక గది దగ్గరకి వచ్చేసరికి వెంటనే తలుపు తీసి ఏదో జరిగినట్టు కలరింగ్ ఇస్తుంది. ఇప్పుడు మేరు ఏం ఆడగబోతున్నారో నాకు తెలుసు అత్తయ్యగారు అని తెగ సిగ్గుపడిపోతూ ఓవరాక్షన్ చేస్తుంది. అది చూడలేక జ్ఞానంబ వెళ్ళిపోతుంది.
Also Read: సామ్రాట్ ఎంట్రీ అదుర్స్ - నందు యాక్సిడెంట్ చేసిన పాపని కాపాడి తులసి చిక్కుల్లో పడనుందా?
ఇక రామా చొక్కా నిండా లిప్ స్టిక్ మార్కులు ఉండటం చూసి అవన్నీ ఎలా వచ్చేయండి అని జానకిని అడుగుతాడు. చేయాల్సింది అంతా చేసి ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారా అని జానకి కాసేపు రామాని ఆటపట్టిస్తుంది. జ్ఞానంబ జానకి, మల్లికలను పిలుస్తుంది. మల్లిక మెలికలు తిరుగుతుంటే జ్ఞానంబ చీవాట్లు పెడుతుంది. 'ఇన్నాళ్ళూ మనసులో బాధని మోస్తూ బయటకి మాత్రం సంతోషంగా తిరిగాను. ఈ ఇంట్లో పసిపిల్లల ఏడుపు వినిపించాలని ఎదురు చూడని రోజు, ఆ దేవుడికి మొక్కని సందర్భం లేదు. ఎందుకో నా కోడళ్లకి ఆ వరం ఇవ్వడం లేదని ఆ దేవుడి మీద చాలాసార్లు కోపం వచ్చింది. మల్లిక ట్యాబ్లెట్స్ వేసుకుందని తెలిసాక, మీ ఇద్దరి మధ్య దూరం ఉందని తెలిసాక నాలో నేను ఎంతో కుమిలిపోయాను. మొన్న నా కోడళ్ళు ఇద్దరు నాకు మాట ఇచ్చిన తర్వాత నా బాధ తీరిపోయింది. త్వరలోనే నా కోడళ్ళ కడుపు పండుతుందని ఆశ నాలో కలిగింది. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది' అని అందరికీ స్వీట్ ఇస్తుంది. ఇక మల్లికని ఇరికించేందుకు విష్ణు ప్రయత్నిస్తాడు కానీ చెప్పనివ్వదు.
Also Read: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని
అమ్మకి ఇచ్చిన మాట కోసం మీరు తపన పడుతున్నారు. కానీ మీరు ఐపీఎస్ అవ్వాలనుకున్న కలని, మిమ్మలని ఐపీఎస్ చేయాలనుకున్న మీ నాన్న కలని నిజం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఈ పరిస్థితులు మీ చదువుకు ఎక్కడ ఆటంకంగా మారతాయో అని చాలా బాధగా ఉండండి అని రామా మనసులో మధనపడతాడు. ఇక జానకి కంటే ముందే పిల్లల్ని కనాలని మల్లిక అనుకుంటుంది. త్వరలోనే నా కోడళ్ళ కడుపు పండేలా చెయ్యమని జ్ఞానంబ దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే అక్కడికి గోవిందరాజులు వస్తాడు. మల్లిక కంటే ముందు శుభవార్తని జానకి నోటి నుంచి వినాలని ఆశ పడుతున్నానని చెప్తుంది. అదేంటి అలా అనుకుంటున్నవాని అడగ్గా చిన్న కోడలు ముందు నెలతప్పితే పెద్ద కోడలిలో లోపం ఉందా అని జనాలు అనే మాటలను నేను తట్టుకోలేనని అంటుంది. అందుకే జానకి ముందు శుభవార్త చెప్పాలని ఆశపడుతునట్టు చెప్తుంది. ఆ మాటలు జానకి చాటుగా వింటుంది.