సినిమా రివ్యూ : అనుకున్నవన్నీ జరగవుకొన్ని
రేటింగ్ : 2.5/5
నటీనటులు : పోసాని కృష్ణమురళి, శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, బబ్లూ మాయ్యా, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, లోహిత్, 'మిర్చి' హేమంత్ తదితరులు  
ఛాయాగ్రహణం : చిన్న రామ్, జీవీ అజయ్ కుమార్ 
సంగీతం : గిడియన్ కట్ట
సహ నిర్మాత : జి. భరత్
కథ, కథనం, మాటలు, నిర్మాణం, దర్శకత్వం : జి. సందీప్
విడుదల తేదీ: నవంబర్ 3, 2023  


Anukunnavanni Jaragavu Konni Movie Review : పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'. కొంత విరామం తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రలో ఆయన తెరపై కనిపించిన చిత్రమిది. శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించారు. బబ్లూ మాయ్య మరో ప్రధాన పాత్ర చేశారు.  
 
కథ : కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల) ఈతరం కుర్రాడు. ఉద్యోగం ఏమీ లేదు. స్నేహితులు, సరదాలు అంటూ జీవితం వెళ్లదీస్తుంటాడు. ఒకానొక సందర్భంలో అతడికి 30 లక్షల రూపాయలు అవసరం అవుతాయి. స్నేహితులను అడిగితే ఒక్కరు కూడా రూపాయి ఇవ్వరు. చివరికి కాల్ బాయ్ (Call Boy)గా మారతాడు. ఓ బుకింగ్ పని మీద వెళ్ళిన అతడికి పెద్ద షాక్ తగులుతుంది. ఓ మహిళ హత్యకు గురి అవుతారు. ఎవరో పీక మీద కోస్తారు. మరోవైపు మధు (కలపాల మౌనిక) కూడా అంతే! డబ్బు కోసం కాల్ గాళ్ (Call Girl)గా మారుతుంది. ఆమెదీ సేమ్ సిట్యువేషన్. ఆమెను బుక్ చేసుకున్న వ్యక్తి హత్యకు గురి అవుతాడు.


రెండు హత్యల వెనుక ఏమైనా సంబంధం ఉందా? కాల్ బాయ్ కార్తిక్, కాల్ గాళ్ మధు ఎలా కలిశారు? ప్రేమలో ఎలా పడ్డారు? వాళ్ళ కథలు ఏమిటి? వాళ్ళిద్దరితో మండేలా (బబ్లూ మాయ్య), అతని అన్నయ్య నెల్సన్ (పోసాని కృష్ణమురళి)కి ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసులను ఎలా సాల్వ్ చేశారు? అనేది సినిమా. 


విశ్లేషణ (anukunnavanni jaragavu konni Telugu movie review) : ప్రేమ, కామం మధ్య ఓ గీత ఉంటుంది. స్క్రీన్ మీద లవ్ మేకింగ్, లస్ట్ సీన్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అలాగే... కాన్సెప్ట్ అండ్ కామెడీకి కూడా! దర్శకుడు జి భరత్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ & కథను కలవాలనుకుంటే లస్ట్ సీన్స్, రొమాంటిక్ కామెడీతో నింపేయవచ్చు. కానీ, ఆయన ఆ విధంగా చేయలేదు. అందుకు మెచ్చుకోవాలి. 


హీరోయిన్లను కాల్ గాళ్ / వేశ్య పాత్రల్లో చూపించిన సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... హీరో కాల్ బాయ్ అయితే? కాన్సెప్ట్ తీసుకుని చేసిన చిత్రమిది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాను కొంచెం కొత్తగా మార్చాయి. 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'లో సిట్యువేషనల్ ఫన్ ఎక్కువ. ఆ కామెడీకి క్రైమ్ ఎలిమెంట్ యాడ్ చేశారు. కథను ఆసక్తిగా ముందుకు తీసుకు వెళ్లారు. 


'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'లో కాన్సెప్ట్ & సిట్యువేషనల్ ఫన్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్న దర్శక నిర్మాత సందీప్ ఫస్టాఫ్ మీద సరిగా కాన్సంట్రేట్ చేయలేదు. అసలు కథలోకి వెళ్ళడానికి ముందు వచ్చే సన్నివేశాలు రొటీన్. పైగా, అవి కూడా సోసోగా ఉన్నాయి. ఒక్కసారి కథలోకి వెళ్లిన తర్వాత కొన్ని లాజిక్స్ మిస్ అయినా మేజిక్ చేస్తూ సస్పెన్స్ మైంటైన్ చేశారు. పోసాని కామెడీతో నవ్వించారు. క్రైమ్ ఎలిమెంట్ & ఇన్వెస్టిగేషన్ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బావుండేది.  


గిడియన్ కట్ట సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. చిన్న సినిమా అయినా సరే మంచి అవుట్ పుట్ ఇచ్చారు. రన్ టైమ్ రెండు గంటల లోపే ఉండటం మరో ప్లస్ పాయింట్.    
 
నటీనటులు ఎలా చేశారంటే... : పోసాని కృష్ణమురళిది టిపికల్ డైలాగ్ డెలివరీ & యాక్టింగ్. క్యారెక్టర్ టెన్షన్ పడే సన్నివేశాల్లో ఆయన సీరియస్ అవుతుంటే స్క్రీన్ ముందు కూర్చున్న ప్రేక్షకులకు నవ్వు వస్తుంది. అటువంటి సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పోసాని టిపికల్ కామెడీ టైమింగ్, బబ్లూతో ఆయన కాంబినేషన్ సీన్లు నవ్విస్తాయి. యూట్యూబర్ బబ్లూ కూడా బాగా చేశారు.


ఈతరం కుర్రాడి పాత్రకు హీరో శ్రీరామ్ నిమ్మల లుక్స్, యాటిట్యూడ్ బాగానే సెట్ అయ్యాయి. సిట్యువేషనల్ ఫన్ సీన్స్ బాగా చేశారు. హీరోయిన్ మౌనిక లుక్స్ గాళ్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉన్నాయి. కాల్ గాళ్ పాత్రకు ఆమె మిస్ ఫిట్ అనిపిస్తుంది. గౌతమ్ రాజు, 'మిర్చి' హేమంత్, కిరీటి దామరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.  


Also Read : 'ఘోస్ట్' సినిమా రివ్యూ : శివ రాజ్‌కుమార్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే... : కొత్త కాన్సెప్ట్‌తో కూడిన కథలు, క్రైమ్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంజాయ్ చేయవచ్చు. పోసాని కామెడీ కోసం ఓ లుక్ వేయవచ్చు. 


Also Read కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?