'Killer Soup' Series Review: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుతుంది. ప్రతివారం డిజిటల్‌ వేదికగా సరికొత్త కంటెంట్‌ అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రిలీజ్‌ చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. అలా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన వెబ్‌ సిరీస్‌ల్లో చెప్పుకొదగినది కిల్లర్‌ సూప్‌ ఒకటి. బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ నేడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. డార్క్‌ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది, ఓటీటీ ప్రియులను ఎంతగా ఆకట్టుకుంటుందో ఇక్కడ చూద్దాం!


మనోజ్‌ బాజ్‌పాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విభిన్న, వైవిధ్య పాత్రలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌ అనే చెప్పాలి. తనదైన విలక్షణ నటనతో ఎప్పుడూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటారు. పాత్ర ఏదైనా తనదైన మార్క్‌ చూపిస్తుంటారు.  అందుకే ఆయనకు నార్త్‌లోనే కాదు సౌత్‌లోనూ మంచి ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. రామ్ గోపాల్ వర్మ సత్య సినిమా నుంచి నిన్నటి సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై వంటి ఓటీటీ మూవీ వరకు ఎన్నో వైవిధ్య పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కిల్లర్‌ సూప్‌ వంటి డార్క్‌ ఫాంటసీ క్రైం థ్రిల్లర్‌తో డ్రామాతో ఓటీటీలో అలరించేందుకు వచ్చారు. ఉడ్తా పంజాబ్', 'సోంచిరియా' వంటి సినిమాలను తెరకెక్కించిన అభిషేక్‌ చౌబే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో మనోజ్‌ భాజ్‌పాయి, బాలీవుడ్‌ నటి కొంకణా సేన్‌ శర్మ ప్రధాన పాత్రలు పోషించగా, మలయాళీ స్టార్ హీరో మోహన్ లాన్, నటుడు నాజర్‌, షియాజీ షిండెలు కీలక పాత్రల్లో నటించారు.


కథ విషయానికి వస్తే..


కిల్లర్‌ సూప్‌లో మనోజ్‌ భాజ్‌పాయి ప్రభాకర్‌ శెట్టిగా నటించాగా ఆయన భార్య స్వాతి పాత్రలో కొంకాణా సేన్‌ నటించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ తమిళనాడులోని పచ్చని పట్టణం మింజూర్‌లో మొదటి సన్నివేశం ప్రారంభమవుతుంది. పచ్చని కొండలు, అందమైన నది.. మెలికలు తిరిగిన రహదారులతో ప్రారంభమై ప్రభాకర్‌ శెట్టి విల్లాకు చేరుకుంటుంది. ప్రారంభంలోనే ఆసక్తిగా సాగిన ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌లోనే క్రైం సన్నివేశాలను చూపించి ఉత్కంఠ పెంచాడు డైరెక్టర్‌. ఎందుకో తెలియదు ప్రభాకర్‌ శెట్టి(మనోజ్‌ భాజ్‌పాయి) తన భార్య స్వాతిని చంపడానికి ప్రయత్నించినట్టు చూపించగా.. అనుకొకుండా భార్య స్వాతి(కొంకణా శర్మ) భర్త ప్రభు శెట్టిని చంపేస్తుంది. అయితే దానికి కారణ ఏంటీ, స్వాతి తన భర్తను ఎందుకు చంపిందనే ఆ వెంటనే రివిల్‌ చేయడం మరింత ఆసక్తిని పెంచుతుంది.  


స్వాతికి రెస్టారెంట్‌ పెట్టి తన వంటతో బాగా ఫేమస్‌ అవ్వాలనుకుంటుంది. ముఖ్యంగా పాయా సూప్‌తో (ట్రాటర్‌ సూప్‌) రుచి చూపించి అందరిని అంబురపరచాలనుకుంటుంది. అదే విషయం భర్త ప్రభాకర్‌ చెబుతుంది. ఇద్దరు రెస్టారెంట్‌ తెరవాలని అనుకుంటారు. అదే సమయంలో ప్రభాకర్‌కు తన భార్య స్వాతి అక్రమ సంబంధం బయట పడుతుంది. ఉమేష్‌ పిళ్లై (మనోజ్‌ భాజ్‌పాయి డ్యూయల్‌ రోల్‌). పెళ్లికి ముందే ఉమేష్‌ను ప్రేమించిన స్వాతి.. పెళ్లి తర్వాత కూడా అతడితో రిలేషన్‌  కొనసాగిస్తుంది. ఇది తెలిసిన ప్రభాకర్‌ భార్య చంపాలనుకుంటాడు. కానీ, స్వాతి ఉమేష్‌తో కలిసి భర్త ప్రభాకర్‌ను చంపేస్తుంది. ఆ తర్వాత అచ్చం తన భర్త ప్రభాకర్‌ పోలికలతో ఉన్న ఉమేష్‌ను తన భర్తగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఓ ప్రైవేటు డిటెక్టివ్‌ మృతి కేసులో అనుమానితుడిగా ప్రభాకర్‌ పేరు ఎక్కడం.. ఇన్వేస్టిగేషన్‌ అంటూ పోలీసులు ప్రభాకర్‌ పేరుతో చలమణి అవుతున్న ఉమేష్‌ని ప్రశ్నించడం వంటి ఆసక్తికర సన్నివేశాలో ఈ వెబ్‌ సిరీస్‌ ఆసక్తిగా సాగుతుంది.


ప్రభాకర్‌ హత్య బయట పడకుండ.. ఉమేషేని ప్రభాకర్‌ అని ప్రపంచాన్ని నమ్మించేందుకు స్వాతి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఎప్పుడూ ఏదోక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇలా ఎపిసోడ్‌లో ప్రతి పది నిమిషాలకు ముందు వారికి ఓ కొత్త సమస్య ఎదురవుతుంది. వాటిని దాటడానికి వారిద్దరు ఏం చేశారు, వారి ఎత్తుగడలు ఏంటనే ప్రతియ క్షణం సస్పెన్స్‌ , థ్రిల్లింగ్‌ ఇస్తుంది. ఈ వెబ్ సీరీస్‌ చూస్తున్నంత చేపు ఉత్కంఠగా కొనసాగుతుంది. నెక్ట్స్‌ ఏంటీ, ఎం జరగనుందనేది అంచన వేయడం కష్టం. అలా ఈ వెబ్ సిరీస్‌ చివరి వరకు థ్రిల్‌ చేస్తూనే ఉంటుంది. అయితే మధ్య వచ్చే లాగ్‌, నిదానంగా సాగే కథ కాస్తా బోర్‌ కోట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అనేక థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కథ ప్లాట్‌గా ఉండటం, నిదానమైన నేరేషన్‌ బోరింగ్‌గా ఉన్న మధ్య మధ్యలో వచ్చే లాజిక్‌, థ్రిల్లింగ్‌ సీన్స్‌ సిరీస్‌ను చివరి వరకు నడిపిస్తుంది. ఇక మనోజ్‌ తన యాక్టింగ్‌ అండ్ కమెడీ స్కిల్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు.