Varalaxmi Sarathkumar about HanuMan: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ గురించి అంతటా పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి.. తమ సినిమా మీద నమ్మకంతో సంక్రాంతి బరిలో దిగడం మామూలు విషయం కాదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సూపర్ హీరో జోనర్‌కు తగినట్టుగానే విజువల్ వండర్‌లాగా ఉందని చెప్తున్నారు. ఇక ఈ మూవీలో తేజ సజ్జాతో పాటు మరో కీలక పాత్రలో నటించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇందులో హీరోకు అక్కగా నటించిన వరలక్ష్మి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా తన పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమాను తను ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని బయటపెట్టింది.
బాలయ్యకు చెల్లి పాత్ర అంటే వేరే లెవెల్
‘‘ఫస్ట్ డే షూటింగ్‌కు ఎప్పుడూ ఒక మూడ్‌లో వెళ్తాం. ఒక కొత్త సినిమా, కొత్త టీమ్ అని తప్పా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ తీసుకోము. కేవలం మన క్యారెక్టర్ మీదే మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సినిమా వైబ్ ఎలా ఉంటుందని తెలియదు’’ అని తన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తుండగానే తేజ సజ్జా మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ‘‘ఒక 6, 7 పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమా వచ్చింది. ఏముంటది ఇంట్రెస్ట్? సరే చూద్దాం, చేద్దాం అనుకున్నారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఆ మాటకు వరలక్ష్మి ఒప్పుకోలేదు. ‘‘మామూలుగా అక్క, చెల్లి పాత్ర చేయాలంటే ఒక విధమైన ఆలోచనలో ఉండిపోతాం. ఎందుకంటే బాలయ్యకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తే అదే వేరే లెవెల్‌లో రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు అనుకున్నాను’’ అంటూ ‘హనుమాన్’ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు తన ఆలోచన ఎలా ఉందో బయటపెట్టదింది వరలక్ష్మి.
సినిమాపై అంచనాలు లేవు
‘‘అప్పటికి నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే తేజ ఎవరో కూడా తెలియదు. కానీ కథ వినగానే లోపల ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా చేయాలి అని. నేను వెంటనే వినయ్‌కు ఫోన్ చేసి కథ వినమని, బాగుందని చెప్పాను. అదేంటో తెలియదు కానీ ఒక ఫీలింగ్ వచ్చింది. చివరిసారి ‘విక్రమ్ వేద’ కథ విన్నప్పుడు ఇదే ఫీలింగ్ వచ్చింది. ‘విక్రమ్ వేద’ ఒక కల్ట్ సినిమాలాగా మారిపోయింది. అప్పుడు కూడా ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు చేయొద్దు అని చెప్పారు. ఈ సినిమా గురించి కూడా మొదట్లో అందరూ అలాగే ఫీలయ్యారు, ఎందుకు అక్కగా చేస్తున్నావని అడిగారు. అలా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, వెళ్తోంది. సినిమా బాగా వస్తుంది అని అనుకున్నాను. అందరితో టీమ్‌గా చాలా క్లోజ్ అయ్యాను. నిజంగా టీజర్ చూసేవరకు సినిమాపై అంత అంచనా లేదు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత నా నిర్ణయం కరెక్ట్ అనిపించింది. నిజంగానే సినిమా వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాలో చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను’’ అని తెలిపింది వరలక్ష్మి శరత్‌కుమార్.
రెండేళ్ల క్రితమే
‘హనుమాన్’ మూవీని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు మేకర్స్. అప్పుడే వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కూడా కథను వినిపించారు. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూనే వచ్చింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వరలక్ష్మి పర్సనాలిటీలో మార్పులు వచ్చాయి. ‘హనుమాన్’ షూటింగ్ సమయంలో తన షెడ్యూల్స్ మారుతున్నాకొద్దీ తన పర్సనాలిటీలో తేడాలు కనిపించాయని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. అప్పుడు లావుగా ఉన్నానని, ఇప్పుడు చాలా బక్కగా అయ్యానని తెలిపింది. కానీ స్క్రీన్‌పై మొత్తంగా చూసుకున్నప్పుడు పెద్దగా తేడా తెలియడం లేదని తేజ అన్నాడు.
Also Read: రాజమౌళి వల్లే ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశా - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ