Guntur Kaaram OTT Date: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ‘గుంటూరు కారం’.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో ముందుగా విడుదలయిన స్టార్ హీరో సినిమా కావడంతో చాలామంది మూవీ లవర్స్.. దీనిని ఫస్ట్ డేనే చూడడానికి బయల్దేరారు. ఇక చూసినవారంతా ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని, మహేశ్ బాబు వన్ మ్యాన్ షో అని పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.


స్ట్రీమింగ్ ఎక్కడ?


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్.. ‘గుంటూరు కారం’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. మహేశ్ బాబు కెరీర్‌లోనే ఇంత  భారీ మొత్తంలో తన స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి అని టాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని మూవీ కాబట్టి.. అసలు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాకముందు నుండే ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్‌ను పెట్టడం.. అందులో మహేశ్ బాబును బీడీతో మరింత మాస్ లుక్‌లో చూపించడంతో ఫ్యాన్స్ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక హీరో ఫ్యాన్స్‌కు ఏం కావాలో, తమ అభిమాన హీరోలు ఏం చేస్తే ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ అవుతారో త్రివిక్రమ్‌కు బాగా తెలుసు. అందుకే పాటలు, డైలాగుల విషయంలో మహేశ్ క్యారెక్టర్‌కు కాస్త వెటకారాన్ని యాడ్ చేశారు.


ఫిబ్రవరిలో రిలీజ్?


ఈమధ్యకాలంలో చాలావరకు సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్సే దక్కించుకుంటోంది. అదే తరహాలో ‘గుంటూరు కారం’ రైట్స్‌ను కూడా దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తెలుగులో సినిమా థియేటర్లలో విడుదలయిన నెలరోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదనే రూల్ నడుస్తోంది. ఆ రూల్ సినిమా రిజల్ట్‌పై ఆధారపడి మారుతూ కూడా ఉంటుంది. కానీ ‘గుంటూరు కారం’ విషయంలో ఆ రూల్ అప్లై అవుతుందని సమాచారం. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి.. సరిగా నెలరోజుల తర్వాత ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. అంటే ఫిబ్రవరీ మూడో వారంలో లేదా చివరి వారంలో ‘గుంటూరు కారం’.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది.


త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఇప్పటికే ‘అతడు’, ‘ఖలేజా’లాంటి సినిమాలు వచ్చాయి. ‘ఖలేజా’ మూవీ కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా.. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా.. ఈ మూవీలో మహేశ్‌ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా ఎన్నిసార్లు టీవీలో వచ్చినా బోర్ కొడుతుంది అనకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఫైనల్‌గా 11 ఏళ్ల తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’ ఫ్యాన్స్ ఎదురుచూపులు వర్త్ అనిపించేలా చేసింది.


Also Read: గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా ఎలా ఉంది - ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ పక్కానా ?