Guntur Kaaram audience review: టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘గుంటూరు కారం’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సైతం ప్రేక్షకులను అలరించింది. మొత్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదరు చూస్తున్న ఈ చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులు ఏం అనుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహేష్ మూవీపై ఆడియెన్స్ లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది బ్లాక్ బస్టర్ బొమ్మ అంటే, మరికొంత మంది వరెస్ట్ మూవీ అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశారంటున్నారు. వెన్నెల కిశోర్, మహేష్ బాబు కామెడీ బాగుందంటున్నారు. శ్రీలీల డ్యాన్స్ మరో లెవెల్ అంటున్నారు.
Blockbuster movie #GunturKaaram @urstrulyMahesh one man show 👌👌👌🔥🔥🔥🔥& @NavinNooli did a wonderful job pic.twitter.com/UIvcbCEKuS
— venkatesh kilaru (@kilaru_venki) January 11, 2024
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంటున్నారు మరికొంత మంది ఆడియెన్స్ చెప్తున్నారు. మహేష్ బాబు కామెడీ బాగా అలరించిందంటున్నారు. ‘కుర్చీ మడతపెట్టి సాంగ్’, క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయంటున్నారు. మహేష్ బాబు మీదగా ఈ సినిమా మొత్తం రన్ అవుతుందంటున్నారు. అటు మహేష్ బాబు గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించాడని చెప్తున్నారు. మహేష్ బాబు టాప్ 3 సినిమాలో ‘గుంటూరు కారం’ ఉంటుందంటున్నారు. ‘పోకిరి’, ‘ఒక్కడు’, తర్వాత ‘గుంటూరు కారం’ నిలుస్తుందంటున్నారు.
మహేష్ బాబు ఒక్కడే ఈ సినిమాను తన భుజాల మీద మోశారంటున్నారు ఆడియెన్స్. మహేష్ బాబును ఎలా చూపించాలో త్రివిక్రమ్ కు బాగా తెలుసు అంటున్నారు. కామెడీ బాగా వచ్చిందంటున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో ఏడిపించడంతో పాటు నవ్వించారని చెప్తున్నారు. క్లైమాక్స్ లో అందరూ కంటతడి పెడతారంటున్నారు.
ఇక ఈ సినిమా అస్సలు బాగా లేదని మరికొంత మంది అంటున్నారు. ఈ సినిమా వరెస్ట్ గా ఉందంటున్నారు. టికెట్లు బుక్ చేసుకుని ఉంటే క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అంటున్నారు. ఫ్యాన్స్ కు తప్ప మిగతా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదంటున్నారు. మహేష్ బాబు నటన, శ్రీలీల డ్యాన్సులు మాత్రం బాగున్నాయంటున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పోల్చితే ‘గుంటూరు కారం’ వెనుకబడిందంటున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.
Read Also: ‘హనుమాన్’ ఆడియెన్స్ రివ్యూ: వర్త్ వర్మ వర్త్ అంటోన్న ప్రేక్షకులు - అది కాస్త తగ్గిస్తే బాగుండేదట!