Hanuman audience review: సంక్రాంతి కానుకగా ‘హనుమాన్’ మూవీ థియేటర్లలోకి అడుగు పెట్టింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిన ఈ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆడియెన్స్ హై ఎక్స్ ఫెక్టేషన్స్ పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుము ఈ సినిమా విడుదల అయ్యింది.
‘హనుమాన్’ అదుర్స్ అంటున్న ఆడియెన్స్
‘హనుమాన్’ సినిమా చూసిన ప్రేక్షకులు ఓ రేంజిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని చాలా సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు. డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్నిసమాపాళ్లలో కుదిరాయంటున్నారు. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయంటున్నారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పెద్ద బలంగా అంటున్నారు. ఫస్టాఫ్ తో పోల్చితే, సెకెండ్ ఆఫ్ కాస్త తగ్గిస్తే బాగుంటుందని అంటున్నారు.
ప్రశాంత్ వర్మపై ప్రశంసలు
ఇక ‘హనుమాన్’ సినిమాలో తేజ సజ్జ నటన మరోలెవెల్ లో ఉందంటున్నారు. సినిమా భారాన్ని మొత్తం తన భుజాల మీద మోశాడంటున్నారు. ప్రశాంత్ వర్మ కథను నడిపించిన తీరు అమోఘం అంటున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ , డైరెక్షన్ క్లియర్ కమాండ్ కనపడుతుందంటున్నారు. చాలా సీన్లు సింప్లి వావ్ అనిపిస్తున్నాయంటున్నారు. నటీనటుల సెలక్షన్ నుంచి యాక్టింగ్ వరకు పేరు పెట్టడానికి లేదంటున్నారు. వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్ చాల కొత్తది ఏమి కాకపోయినా, తక్కువ బడ్జెట్ తో వండర్స్ చేశారంటున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి, తేజ మధ్య అక్క తమ్ముడు సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో ఇంత బాగా ఎవరు చూపించలేదంటున్నారు. వరలక్ష్మి సినిమా కోసం ప్రాణం పెట్టి నటించిందంటున్నారు. మిగతా నటీనటులు కూడా చక్కగా చేశారంటున్నారు.
‘గుంటూరు కారం’కు ఇబ్బంది తప్పదా?
‘హనుమాన్’ సినిమా దెబ్బ ‘గుంటూరు కారం’ మీద గట్టిగానే పడుతుందంటున్నారు ఆడియెన్స్. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్తున్నారు. తేజ సజ్జ మేచ్యూర్ యాక్టింగ్‌తో 'హనుమాన్'కు ప్రాణం పోశారంటున్నారు. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ తన నటనతో బాగా ఆకట్టుకుందంటున్నారు. వినయ్ రాయ్, సముద్రఖని నటన కూడా చాలా బాగుందంటున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం అంటున్నారు.
ఆకట్టుకుంటున్న మీమ్స్
ఇక ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ లభిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మీమ్స్ సైతం వచ్చేస్తున్నాయి. ఈ సినిమాను చూసి ‘ఆదిపురుష్’ డైరెక్టర్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటున్నారు.
సినిమా థియేటర్లలో ఆడియెన్స్ ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోగానే ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టి అభినందించడం విశేషం. అటు ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు గట్టి హగ్ చేసుకుని తమ ఆనందాన్ని వ్యక్తపర్చుకున్నారు. ఇక ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: ‘సైంధవ్’ నా కెరీర్‌లో డిఫరెంట్ మూవీ, ఆ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు: విక్టరీ వెంకటేష్