Krishna Mukunda Murari Promo Today: దేవ్ నేరం చేసినట్లు ఒప్పుకొని జైలుకి వెళ్తాడు. దీంతో కృష్ణ వాళ్ల తప్పు లేదని తేలడంతో ముకుంద పెళ్లి ఆగిపోతుంది. ఇక భవాని కృష్ణని మురారి భార్యగా ఒప్పుకోవడంతో పాటు ముకుంద మారడంతో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది.. తాజాగా ఈ సీరియల్ ప్రోమో వచ్చింది. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగింది అంటే..


కృష్ణ చేతిలో దువ్వెన పట్టుకొని మురారితో నేను మీ వీపు మీద కొన్ని లెటర్స్ రాస్తాను అవేంటి మీరు గెస్ చేసి చెప్పాలి అని అంటుంది. దానికి మురారి సరే అంటాడు. ఇక కృష్ణ M అని రాస్తుంది. అది చెప్పిన మురారి M అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి కృష్ణ సిగ్గుపడుతూ M అంటే మీరు అంటుంది. తర్వాత ఇంకోటి రాస్తాను అని దానిమీద మీరు అస్సలు రియాక్ట్ అవ్వొద్దని కృష్ణ అంటుంది. మురారి వీపు మీద చాలా రాస్తుంది. దానికి మురారి కృష్ణ వైపు తిరిగి మే తుమ్ సే ప్యార్ కర్‌తీ హూ (హిందీలో ఐ లవ్ యూ) అని రాశావని చెప్తాడు. దానికి కృష్ణ సిగ్గుపడుతుంది.



నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..


శకుంతల తన భర్త పెద్దపల్లి ప్రభాకర్‌కి ఫోన్ చేస్తుంది. జైల్లో ఎందుకు గొడవ పెట్టుకున్నావని తిడుతుంది. ఇక రేవతి, కృష్ణ, మురారి అక్కడికి వస్తారు. ఇంతలో ముకుంద కూడా వచ్చి చిన్నమ్మ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అంటుంది. ఇక కృష్ణతో మీరు కలిసిపోయారు. నేను మారిపోయాను.. నిజంగా ఇది మనకు పండగే కదా అని అంటుంది. ఇంతలో మధు వస్తాడు. మధుతో కృష్ణ ఈ సంక్రాంతి పండగను డబుల్‌ ఢమాకా ఉండేలా ముకుంద ప్లాన్ చేస్తుందని చెప్తుంది. రేపు భోగి అందరికీ గుర్తుండిపోయాలా చేస్తా నాకు వదిలేయండని ముకుంద అంటుంది. ఇక కృష్ణ, మురారిలు బయటకు వెళ్తారు. 


ఇక రేవతి శకుంతలతో మధు ముకుందను నమ్మొద్దని ముకుంద ఇంకా మారలేదు అని తనకు అనుమానం ఉందని చెప్పాడని చెప్తుంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని అంటుంది. ఇక మధు అయితే ముకుందను అనుమానంగా చూడొద్దని.. ఒకవేళ ముకుంద నటిస్తే మనం అనుమానిస్తున్నాం అని జాగ్రత్త పడుతుందని చెప్తాడు. మురారి, కృష్ణ బైక్‌ మీద వెళ్తుంటారు. కృష్ణ చలి మురారితో చెప్తుంది దీంతో మురారి షడెన్‌గా బ్రేక్ వేసి తనని గట్టిగా పట్టుకోమని చెప్తాడు. కృష్ణ అలా పట్టుకొని చలి లేదని చెప్తుంది. మరోవైపు సుమలత తన భర్తతో ముకుంద నిజంగానే మారిందా అని అడుగుతుంది. దానికి ప్రసాద్ ముకుంద అన్నలా తను కూడా నాటకం ఆడితే ముకుందకు వచ్చిన లాభం ఏంటి అని ప్రశ్నిస్తాడు. కృష్ణ ముకుందకు ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల ముకుంద ఎమోషనల్ అయిందని తను ఇక ఏ తప్పు చేయదని అంటాడు. 


మరోవైపు రేవతి కృష్ణ, మురారిల శోభనం ముహూర్తం గురించి భవానికి చెప్పాలి అనుకుంటుంది. తనకి తెలీకుండా పంతుల్ని పిలిస్తే ఆమె తన మీద కోపంతో చెప్పడం లేదని బాధపడుతుందని అనుకుంటుంది. ఇప్పటికే భవాని తనతో అనకపోయినా.. ఒక తప్పుని కాపాడడానికి ప్రయత్నించినందుకు లోలోపల చాలా బాధ పడుతుంది. ఇంతకు ముందులానే అక్కతో ఉంటే ఆ బాధని మర్చిపోతుంది. తనతో మాట్లాడటానికి వెళ్తుంది. పెద్దపెల్లి ప్రభాకర్‌ గురించి లాయర్‌తో మాట్లాడానని భవాని రేవతికి చెప్తుంది. ఇక భవాని ముహూర్తం పెట్టించమని రేవతికి చెప్తుంది. రేవతి చాలా సంతోషిస్తుంది. 


ఇక కృష్ణ, మురారిలు ఆర్మీ అతని తమ్ముడు మెహతాను కలుస్తారు. ఆదర్శ్ ఇప్పుడు ఎన్‌ఎస్ కంపెనీలో కమాండర్‌గా ఉంటున్నాడని.. ప్రమోషన్ వచ్చిందని.. ఇది 6 నెలల క్రితం మాట అని మెహతా చెప్తాడు. దీంతో కృష్ణ వీలైనంత తొందరగా ఆదర్శ్ గురించి చెప్పమని అడుగుతుంది. మరోవైపు ముకుంద శకుంతలతో మాట్లాడుతుంది. తన మీద నమ్మకం లేదు కదా అని అడుగుతుంది. ఇక శకుంతల అలా ఏం లేదు బిడ్డా. నువ్వు మారావ్ కదా అంతే చాలు. నీ ఈడు బిడ్డే కదా మా కిట్టమ్మ కూడా. దాని జీవితం కూడాఎక్కడ ఆగం అవుతుందో అని భయపడ్డా అంతే అని అంటుంది. దానికి ముకుంద చిన్మమ్మ ప్రమాణం చేసి చెప్తున్నా.. ఇక కృష్ణ జీవితంలోకి అడ్డురాను అని అంటుంది. తర్వాత నందూ, ముకుంద, మధులు మార్కెట్‌కి బయలుదేరుతారు. కృష్ణ చలి అని స్వెటర్ కొనుక్కొని తర్వాత ఐస్‌క్రీమ్ కొనుక్కొని తింటుంది.


Also Read: సత్యభామ సీరియల్, జనవరి 12: ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్న సత్య!