Satyabhama Today Episode: భైరవి అత్తయ్య ఎవరితోనూ మాట్లాడకుండా చేతిలో గంట పట్టుకొని ఊపుతూ ఉంటుంది. వాటిని గంట అనే పని వాడు విని అర్థాలు చెప్తాడు. ఇక భైరవి వచ్చి ఏంట్రా గంట నువ్వు చేస్తున్న పని అని అడిగితే.. అమ్మగారు నేను నిన్న ఓ తప్పు చేశాను అంట అందుకే క్షమాపణ చెప్తున్నాను అని అంటాడు. ఇక అప్పుడే వాళ్లింటికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. అందులో ఒకఆమెకు మనవుడు పుట్టాడు అని బారసాల చేస్తున్నామని చెప్పి పిలుపు చేస్తారు. ఇక రేణుక ప్రెగ్నెంట్ కాలేదు అని వచ్చిన వాళ్లు తలా ఓ మాట అంటే రేణుక ఏడుస్తుంది. బామ్మ రేణుకని ఓదార్చుతుంది.
మరోవైపు మహాదేవయ్య, రుద్రలతో కలిసి క్రిష్ కారులో వెళ్తుంటాడు. ఎమ్మెల్యే సీటుకోసం మినిస్టర్‌తో మాట్లాడటానికి వెళ్తారు. మీరు వెళ్లి మాట్లాడితే సరిపోయేది ఆయన దగ్గరకు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అని క్రిష్ అడిగితే నీకు ఇప్పుడు ఇంకేం పని ఉందని రుద్ర అడుగుతాడు.
క్రిష్: పని గురించి కాదులే.. ఇలాంటి ముచ్చట్లు చేయాలి అంటే మనకు మస్తు టైం పడుతుంది.
మహాదేవయ్య: అంత టైం ఏం పట్టదులే చిన్నా. వెళ్లామా ముచ్చట చెప్పామా అంతే..
క్రిష్: బాబీతో ఫోన్‌లో.. అరే బాబీ చిన్న పడిపని బయటకు పోతున్నా నువ్వు బైక్‌తో రెడీగా ఉండు అవసరం అయితే కాల్ చేస్తా వచ్చేద్దావు కానీ.
రుద్ర: అరేయ్ పొద్దుగాల ఎప్పుడో బయటకు పోతావ్.. చీకటి పడ్డాక వస్తావ్. ఆ మినిస్టర్‌కి కూడా నీ అన్ని పనులు ఉండవురా.
క్రిష్: మనసులో.. నువ్వు కూడా నాలెక్క ఎవరికైనా దిల్ ఇచ్చుంటే అప్పుడు తెలిసేది.. మినిస్టర్ కంటే పోరీని పటాయించడం ఎంత కష్టమో.
విశాలాక్షి: ఏంటి లెక్కలు వేసుకుంటున్నారు.
విశ్వనాథం: ఆ తర్వాత లెక్కలు తప్పి చిక్కుల్లో పడకూడదు అని. రెండు జీవితాలను కూడటానికి మన దగ్గర దాచుకున్న డబ్బుని తీసేయడం సరిపోకపోతే పక్కన అప్పు తెచ్చుకోవడం.
విశాలాక్షి: సత్య పెళ్లి కోసమా.. ఇంతకీ లెక్కలు ఏం తేల్చారు. క్షేమంగా బయటపడతామా..
విశ్వనాథం: ఈదాల్సింది చెరువు కాదు సముద్రం అంత సులభంగా ఎలా బయటపడతాం. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసుకి కట్టిన డబ్బులు, రావాల్సిన చీటీ డబ్బులు అంతా కలిపి చూసినా పెళ్లి ఖర్చుకు చాలటం లేదు. వెలతి కనపడుతుంది. ఈ ఇళ్లు తాకట్టు పెట్టాలి అనుకుంటున్నాను. ఇది మనింట్లో జరగబోయే మొదటి పెళ్లి ఎక్కడా తగ్గకూడదు.
సత్య: అన్నీ చాటుగా విని అక్కడికి వస్తుంది. ఎందుకు దాస్తున్నావ్ నాన్న.
విశ్వనాథం: ఇది నీకు సంబంధించిన విషయం కాదు సత్య అందుకే దాస్తున్నా.
సత్య: ఇది నా పెళ్లికి సంబంధించినది నాకు సంబంధం లేకపోవడం ఏంటి.
విశ్వనాథం: పెళ్లి మాత్రమే నీకు సంబంధించినది. పెళ్లి ఖర్చు మాకు సంబంధించినది.
సత్య: కూతురిగా మీ సంతోషంలోనే కాదు నాన్న కష్టాల్లోనూ భాగముంటుంది. నేను అంతా విన్నాను నాన్న. ఇన్నేళ్ల సర్వీస్‌లో మీరు దాచుకున్నదంతా నా కోసమే ఖర్చు పెట్టేస్తే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి నాన్న. చెల్లెలి పరిస్థితి ఏంటి. నా పెళ్లి మీ కళ్లలో ఆనందం నింపాలి కానీ బాధ కాదు.
విశాలాక్షి: పెళ్లి సింపుల్‌గా ఎలా తేల్చేస్తాం అనుకున్నావే. పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిపిస్తే అత్తారింట్లో ఆ కూతురుకి అంత విలువ పెరుగుతుంది. నీ పుట్టింటి గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. మాకు కావాల్సింది అత్తింట్లో నువ్వు గౌరవంగా ఉంటడం.
సత్య: నాకు అక్కడ గౌరవం దక్కొచ్చేమో.. కానీ పెళ్లి తర్వాత మీరు ఇక్కడ పడే కష్టాలు తలచుకుంటే మనసుకి బాధగా ఉంది. నేను ఉద్యోగం చేసి సంపాదించుకొని దాచిపెట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే పెళ్లి వద్దు.
విశ్వనాథం: అందరి ముందు మీ నాన్నని కూతురి పెళ్లి చేయలేని చేతకాని వాడిలా నిలబెట్టాలి అనుకుంటున్నావా. అందరూ అలానే అనుకుంటారు అమ్మా. నా మొఖం మీదే అడుగుతారు. ఈ ఫ్యామిలీని నడపడం యజమానిగా నా బాధ్యత నువ్వు దాని గురించి మర్చిపో.
విశాలాక్షి: చూడు సత్య రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచించు. ఈ సంబంధం గడప దాటకుండా వెళ్లకుండా ఏం చేయాలో అది ఆలోచించు మాకు గొప్ప సాయం చేసినట్లే. అర్థమైందా..
మరోవైపు రుద్ర, మహదేవయ్య, క్రిష్‌లు మినిస్టర్ ఇంటికి వస్తారు. మినిస్టర్ ధర్మ మహదేవయ్య వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మహదేవయ్యకు చాలా భయపడతాడు. ఇక మహదేవయ్య ఇద్దరు కొడుకులు రుద్ర, క్రిష్‌లను పొగుడుతాడు. క్రిష్ బయటకు వెళ్లాలి అని ట్రై చేస్తాడు. గతంలో క్రిష్ చేసిన ఫైటింగ్ గురించి మాట్లాడుతాడు. ఇక బయటకు వచ్చేసిన క్రిష్ బాబీకి కాల్ చేసి మినిస్టర్ ఇంటికి బైక్ తీసుకొని వచ్చేయ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.