Gruhalakshmi Telugu Serial Today Episode:  మీకెన్ని సార్లు చెప్పినా మీరు మారరు అంటూ పరంధామయ్య, అనసూయను తిట్టడంతో అనసూయ షాక్‌ అవుతుంది. అంతసేపు పరంధామయ్యకు గతం గుర్తుకు వస్తుందా? అనుకుని భయంతో చూస్తున్న లాస్య సంతోషిస్తుంది. తులసి మీ దృష్టిలో ఎంతటి మంచి మనిషైనా అయ్యుండొచ్చు కానీ నందూకు విడాకులిచ్చాక తను ఇక ఈ ఇంటి మనిషి కాదు అనసూయ అంటూ ఈ ఇంటి కోడలు  లాస్య. మనం మంచి చెడ్డలు చూడాల్సింది లాస్యకు అని చెప్పి పరంధామయ్య లోపలికి వెళ్లిపోతాడు. లాస్య చాలా హ్యాపీగా ఇదే కదా నాకు కావాల్సింది. ఇక చూడు తులసిని వెంటనే ఇంట్లోంచి వెళ్లగొట్టాలి. ఈ లాస్య అంటే ఎంటో తెలిసేలా చేస్తా అని మనసులో అనుకుంటుంది. బయట టెర్రస్‌లో పడుకున్నతులసిని చూసి పనిమనిషి రాములమ్మ వెళ్లి నిద్ర లేపుతుంది. తులసి ఫోన్‌లో ఉన్న చందన ఫోటో చూసి ఈ అమ్మాయి ఫోటో మీ ఫోన్‌లో ఉందేంటమ్మా అని అడుగుతుంది. ఈ అమ్మాయి నీకు తెలుసా? అంటూ ఆత్రుతగా తులసి అడగడంతో  నాకు తెలియదు కానీ మా బస్తీలోనే చూశానమ్మా అంటూ రాములమ్మా చెప్పడంతో అర్జెంట్‌గా నేను ఈ అమ్మాయిని కలవాలి. మాట్లాడాలి అని తులసి చెప్పి.. నేను ఇప్పుడే వస్తాను ఆగు అంటూ లోపలికి వెళ్తుంది తులసి. మరోవైపు గార్డెన్‌లో విక్రమ్‌, దివ్య చేయి పట్టుకుని నడిపిస్తుంటాడు.


దివ్య: ఎంటి చిన్న పిల్లను అనుకున్నావా? చెయి పట్టి నడిపిస్తున్నావు.


విక్రమ్‌: చిన్నపిల్లలనే చెయ్యి పట్టుకుని నడిపించరు. చిన్న పిల్లల్లా చూసుకునే వారిని కూడా నడిపిస్తారు.


దివ్య: చెయ్యి పట్టి నడిపించడమేనా? లేకా ఎత్తుకుని జోకొట్టడమేనా?


అంటూ దివ్య అనగానే నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని అనిపిస్తుంది అని విక్రమ్‌ అనగానే. నాకు ఇంతకు ముందు కూడా పిచ్చి ఉంది. నువ్వుంటే పిచ్చి ఉంది. కానీ అందరూ కలసి నన్ను నిజంగానే పిచ్చిదాన్ని చేస్తున్నారేమో అనిపిస్తుంది అని విక్రమ్‌ను హగ్‌ చేసుకుంటుంది దివ్య. ఇంతలో అక్కడకు బసవయ్య, సంజయ్‌ వస్తుంటారు. వాళ్లను చూసి ఆగండని చెయ్యి చూపిస్తాడు. ఎంత అవసరం ఉందో వాళ్ల సంగతి చూడండి అంటుంది.  బసవయ్య, విక్రమ్‌ దగ్గరకు రాగానే..


విక్రమ్‌: ఎంత చెప్పినా వినరేంటి? కాసేపు కూడా మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వరా?


బసవయ్య: వదిలేస్తే హాస్పిటల్‌ సంగతి ఎవరు చూస్తారు అల్లుడు. మీ నాన్నకు ఆసక్తి లేదు. మీ అమ్మకు ఓపిక లేదు. దివ్యను చూస్తేనేమో ఇలా ఉంది.


అంటూ బసవయ్య మాట్లాడుతుంటే అసలు సంగతి చెప్పండి అనగానే సంజయ్‌ కొన్ని పేమెంట్లు చేయాలి.. అంటూ చెక్కులు ఇవ్వగానే విక్రమ్‌ గబగబా సంతకాలు చేసి దివ్యను తీసుకుని వెళ్లిపోతాడు. రాజ్యలక్ష్మీ అక్కడకు రావడంతో బసవయ్య, సంజయ్‌ విక్రమ్‌ చిరాకు పడుతున్నాడని చెప్తారు. దీంతో వాణ్ని ఇలాగే ఇరిటేట్‌ చేయండి. ఈ ఆస్తులు, సంతకాలు నాకొద్దు అనేంతగా చేయండి తర్వాత కథ నేను నడిపిస్తాను అంటుంది రాజ్యలక్ష్మీ. మరోవైపు తులసి, నంద కలసి చందన కోసం బయటకు వెళ్తుంటే పరంధామయ్య వచ్చి మీరిద్దరు కలిసి వెళ్లడం ఏంటని నిలదీస్తాడు. ఇంతలో లాస్య లాయరును తీసుకొచ్చి ఇంటి విషయంలో మామగారు లాయరును తీసుకురమ్మాన్నారని లాస్య చెప్తుంది. దీంతో నంద కోపంగా పరంధామయ్య ను తిడతాడు. తులసి మాత్రం చాలా కూల్ గా ఇంపార్టెంట్ పనిమీద బయటకు వెళ్తున్నామని తర్వాత కలుస్తానని చెప్పి నంద, రాములమ్మతో కలిసి బయటకు వెళ్తారు. మరోవైపు విక్రమ్‌, దివ్యకు అన్నం తినిపిస్తుంటే మళ్లీ బసవయ్య, సంజయ్‌ వచ్చి ఏవో బిజినెస్‌ విషయాలు చెప్తుంటే..వాళ్లను తిడుతూ బయటకు వెళ్లండని వార్నింగ్‌ ఇస్తాడు. దివ్య మాత్రం ఆ బిజినెస్‌ విషయాలు నేను చూసుకుంటానని చెప్తుంది. దీంతో ఇవాళ్టీకి ఈ డోస్‌ చాలులే అని మనసులో అనుకుంటూ బసవయ్య, సంజయ్‌ని తీసుకుని రాజ్యలక్ష్మీ దగ్గరకు వస్తారు.  


రాజ్యలక్ష్మీ: ఏమంటున్నాడు వాడు ఇరిటేట్‌ అవుతున్నాడా?


సంజయ్‌: వాడు ఇరిటేట్‌ కావడం కాదు. నీ పెద్దకోడలు మాత్రం పిచ్చ ఫామ్‌లో ఉంది. అంత ఏడుపులో కూడా ఆక్సిజన్‌ టవర్‌ సంగతి నేను చూసుకుంటానంటుంది. అంతే తప్పా నాకు మాత్రం పవర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని చెప్పడం లేదు.


బసవయ్య: లోకం తీరే అంత చిన్నల్లుడు. చిన్నపిల్లాడి చేతికి చాక్లెట్‌ ఇచ్చాక తిరిగి ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వడు.


రాజ్యలక్ష్మీ: అదేంటి ఇచ్చేది. విసుగుపుట్టి ఆ విక్రమ్‌ గాడే ఇచ్చేలా చేస్తాను.


అని మాట్లాడుకుంటుండగానే రాజ్యలక్ష్మీకి లాస్య ఫోన్‌ చేసి చందన గురించి తులసికి తెలిసిపోయినట్లుంది వెతకడానికి వెళ్లారు అంటూ చెప్తుంది. మరోవైపు తులసి, నంద, రాములమ్మ చందన వాళ్ల ఇంటికి వెళ్తారు. చందన గురించి వాళ్ల అమ్మానాన్నలను అడిగి తెలుసుకుంటారు. వారు చందన చనిపోయిందని చెప్తారు. దీంతో తులసి, నంద, రాములమ్మ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్