జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వానాకాలంలో మన జుట్టు నిర్జీవంగా జిడ్డుగా ఉంటుంది. వర్షానికి తడిసి జీవాన్ని కోల్పోతుంది. జుట్టు సంరక్షణ విషయంలో అశ్రద్ధగా ఉంటే చిట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. చాలా మందికి జుట్టు పొట్టిగా ఉంటుంది. దాన్ని ఎలా పెంచాలా అని మార్కెట్లో దొరికే రకరకాల అయిల్స్ తెచ్చి వాడేస్తారు. ఇంకేముంది జుట్టు పెరగడం ఏమో కానీ ఉన్న జుట్టు ఊడిపోతుంది. అందుకే వంటింట్లో సులభంగా దొరికే వాటితోనే మన కేశాలు ఒత్తుగా పొడవుగా చేసుకోవచ్చు. అమ్మాయిలకి అందం ఇచ్చేదే జుట్టు. మరీ మీరు కూడా పొడవాటి జడ కావాలని కోరుకుంటున్నారా అయితే మీ డైట్ లో వీటిని భాగం చేసుకోండి. 


ఉసిరి 


ఉసిరి కాయ జుట్టు పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీ జుట్టు అందంగా పొడవుగా పెరిగేందుకు అవసరమయ్యే పోషకాలను ఇది అందిస్తుంది. 


ఆవిసె గింజలు 


ఆవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ జుట్టుని బలంగా చేయడంతో పాటు కేశాలు ధృడంగా మారేందుకు సహకరిస్తుంది. అంటే కాదు మీ జుట్టు ఒత్తుగా  వస్తుంది. 


కరివేపాకు 


కరివేపాకు కంటికే కాదు జుట్టు పెరుగుదలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇక నుంచి వంటల్లో వేసుకున్న కరివేపాకు పక్కన పెట్టకుండా తినెయ్యండి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. అవి జుట్టు పెరుగుదలకు దోహదపడతాయని పోషకాహార నిపుణురాలు పూజ మాఖీజా చెప్పుకొచ్చారు. 


ఎగ్స్ 


కోడిగుడ్లులో ప్రోటీన్లు, బయోటిన్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫోలిక్స్ ఎక్కువగా ప్రోటీన్స్ తోనే తయారవుతాయి. అందుకే మనకి కావాల్సినట ప్రోటీన్లు అందకపోతే జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. కేరాతిన అనే హెయిర్ ఫోలిక్ ఉత్పత్తికి బయోటిన్ ఉపయోగపడుతుంది. మీ డైట్ లో గుడ్డు భాగం చేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 


అవకాడో  


రుచికరమైన, ఆరోగ్యకమైన పదార్థం అవకాడో. విటమిన్ ఇ ఉండటం వల్ల ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 200 గ్రాముల అవకాడోలో 21% విటమిన్ ఇ ఉంటుంది. 


Also Read: గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలు వస్తాయా? జర చూసుకోండి మరి


Also Read: కొబ్బరికాయ పీచు వల్ల ఉన్న ఉపయోగాలు తెలిస్తే మీరు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయరు