కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు. శరీరం డీహైడ్రేట్ అయితే కొబ్బరి నీళ్ళు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇక కొబ్బరి నూనె జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. కొబ్బరి వల్లే కాదండోయ్ కొబ్బరి కాయకి ఉన్న పొట్టు వల్ల కూడా బోలెడు లాభాలు ఉన్నాయి. అదేంటి దానితో ఏం లాభాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా అయితే దీని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ కొబ్బరి పొట్టుతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మన వంటింటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. 


అతిసార తగ్గిస్తుంది


విరోచనాలు తగ్గించేందుకు, జీర్ణక్రియని మెరుగుపరిచేందుకు ఈ కొబ్బరి పొట్టు నీరు చాలా ఉపయోగపడుతుంది. బ్రెజిల్ లోని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పొట్టు నీటిని గొప్పా ఔషధంగా ఉపయోగిస్తారు.  కడుపు నొప్పికి ఇది మంచి నివారణ అని నమ్ముతారు. కొబ్బరి పొట్టుని తీసుకుని శుభ్రంగా కడుగుతారు. తర్వాత దాన్ని నీటిలో వేసి బాగా ఉడికిస్తారు. ఆరిన తర్వాత వడకట్టి ఆ నీటిని కడుపులో ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారికి ఇస్తారు. డయేరియాతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఔషధం. 


కొబ్బరి పొట్టు టీ 


కొబ్బరి పొట్టుతో టీ కూడా చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ టీ చాలా బాగా పని చేస్తుంది. ఈ సంప్రదాయ మెడిసిన్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందొచ్చు.  కొబ్బరి పొట్టులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పులని తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది. 


వంట పాత్రలు శుభ్రం చేసుకోవచ్చు 


పాత కాలంలో అంట్లు తోముకునేందుకు ఇప్పటిలాగా స్క్రబ్బర్ ఉండేవి కాదు. కొబ్బరి పీచుతోనే అంట్లు కడిగేవాళ్ళు.  బొగ్గుపొడి, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో కొబ్బరి పీచు వేసి అంట్లు శుభ్రం చేసుకుంటే మీ పాత్రలు మెరిసిపోతాయి. 


దోమల నివారణకు 


సంప్రదాయ ఇత్తడి పాత్రలో కొబ్బరి పీచు వేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి మండిస్తే ఇంట్లో ఉన్న చెడు వాసన పోయేలా చేస్తుంది. దోమల రాకుండా చేసేందుకు కూడా ఇది మంచి పద్ధతి. 


వంటకాల్లో 


కొన్ని ప్రాంతాల్లో వంటకాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల వంటకానికి అదనపు రుచి వస్తుంది. 


కొబ్బరి పీచు వల్ల ఎన్ని ఉపయోగాలో కదా. అందుకే ఇంకోసారి కొబ్బరి పీచు పారేయకుండా ఇవి ట్రై చేసి చూడండి. 


Also read: రోజుకో గ్లాసు రాగిజావ తాగితే మధుమేహం నియంత్రణలో ఉండడం ఖాయం


Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు