ఒకప్పుడు రాగి ముద్ధ తెలుగువారిఇళ్లల్లో ప్రధాన వంటకం. ఎప్పుడైతే వరి అన్నం అధికంగా తినడం అలవాటైందో అప్పట్నించి రాగులు, జొన్నలు వంటివి వాడడం తగ్గించేశారు. నిజానికి వరి అన్నం కన్నా రాగులు, జొన్నలతో చేసిన వంటకాలే శరీరానికి చాలా బలమైనవి. వీటిని ప్రధాన ఆహారంగా ఎలాగూ వాడడం లేదు. కనీసం రోజులో ఒకసారైనా తింటే ఆరోగ్యానికిన చాలా మంచిది. ముఖ్యంగా రాగిజావతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహులు రోజూ గ్లాసు రాగి జావ తాగితే ఆ రోగాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. గ్లాసు రాగి జావలో రెండు స్పూనుల పెరుగు లేదా పావు గ్లాసు మజ్జిగ కలుపుకుంటే చాలా మంచిది. 


మధుమేహులకు ఎందుకు మంచిది?
రాగిలో ఫైబర్, మినరల్స్, అమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రాగి జావ తాగడవం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. వరి, గోధుమ కన్నా డయాబెటిస్ వారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడమే చాలా ముఖ్యం. రాగి జావను మధుమేహులు రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఒకేసారి అమాంతం పెరగకుండా వాటిని స్థిరంగా ఉంచుతాయి. రాగులలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, ఇన్సులిన్ నిరోధకతలను తగ్గించటానికి సహాయపడుతుంది. 


ఉదయానే...
రాగిజావ తాగడానికి బెస్ట్ టైమ్ ఉదయమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగులతో చేసిన అట్లు, రాగి జావ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి మధుమేహులు రోజూ రాగి జావ తాగితే చాలా మంచిది. 


యాంటిడిప్రెసెంట్...
మానసిక ఆందోళనలు ఎకువవుతున్న రోజులు. యాంగ్జయిటీ, గాభరా, అతిగా భయపడడం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది రాగిజావ. నిద్రలేమి రాకుండా కాపాడుతుంది. ఇది సహజమైన యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. రాగుల్లో ఉండే అమినో ఆమ్లాలు సహజంగానే రికాలక్సెంట్ గా పనిచేస్తాయి. మైగ్రేన్ ఉన్నవారికి కూడా రాగులు చాలా మేలు చేస్తాయి. దీనిలో ప్రోటీన్ అధికం. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా చేరదు.


ఇంకా ఎన్నో ప్రయోజనాలు...
రాగిజావ తాగడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. ఆకలి అధికంగా వేయదు. బరువు కూడా పెరగరు. అన్నట్టు ఇది త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. దీనిలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి అజీర్తి సమస్యలను తీరుస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి అధికంగా లభిస్తాయి. 


Also read: ఈ నాలుగు పండ్లలోని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో తినకండి



Also read: టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలను, కోపాన్ని పెంచేస్తున్న వీడియో గేమ్స్, తల్లిదండ్రులూ జాగ్రత్త


Also read: ఈ నాలుగు పానీయాలు మీ తలనొప్పిని తీవ్రంగా మారుస్తాయి, తాగకపోవడం మంచిది