TS Poly CET 2022: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2022 పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి 22 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా జులై 20 నుంచి 23 వ‌ర‌కు అభ్యర్థుల ధ్రువపత్రాల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది.


ధ్రువపత్రాల ప‌రిశీల‌న పూర్తయిన అభ్యర్థులు జులై 20 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. వీరికి జులై 27న సీట్లను కేటాయించ‌నున్నారు. ఇక అభ్యర్థులు జులై 27 నుంచి 31 వ‌ర‌కు త‌మ‌కు కేటాయించిన కళాశాలల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆగ‌స్టు 1 నుంచి తుది విడ‌త కౌన్సెలింగ్: 
మొదటి విడత పాలిసెట్ కౌన్సెలింగ్ అనంతరం ఆగ‌స్టు 1 నుంచి తుది విడ‌త కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ హాజరయ్యే అభ్యర్థులు ఆగస్టు 1న స్లాట్ బుకింగ్ చేసుకోవ‌చ్చు. వీరికి ఆగస్టు 2న ధ్రువపత్రాల ప‌రిశీల‌న నిర్వహిస్తారు. వీరకి ఆగస్టు 3 వ‌ర‌కు తుది విడ‌త వెబ్ ఆప్షన్లు న‌మోదుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులకు ఆగ‌స్టు 6న సీట్లు కేటాయించనున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 10 వ‌ర‌కు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిష‌న్ల విధి విధానాల‌ను అధికారులు వెల్లడించ‌నున్నారు.


ఆగ‌స్టు 17 నుంచి తరగతులు..
పాలిటెక్నిక్ మొద‌టి సంవ‌త్సరం త‌ర‌గ‌తులు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 


అందుబాటులో ర్యాంకు కార్డులు...
తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జూన్ 30న రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 13న పాలిసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం మంది అంటే 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 40,669 మంది అంటే 72.12 శాతం, బాలికలు 38,369 మంది అంటే 79.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి.. https://polycetts.nic.in/rank_card.aspx


Also Read: నీట్ యూజీ హాల్‌టిక్కెట్లు వచ్చేశాయ్.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!!


Also Read: ఏపీ గురుకులాల్లో సీట్ల కోసం డిమాండ్ -భర్తీ కోసం మంత్రి ఏం చెప్పారంటే ?