దర్శకుడు కొరటాల శివ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరి మధ్య కొరటాల శివ గురించి హీటెడ్ ఆర్గుమెంట్ జరుగుతోంది. ఇందులో కొందరు కొరటాలకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆయన్ను తిట్టిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలని కొరటాల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 'ఆచార్య' సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు మార్కెట్ వ్యవహారాలు కూడా కొరటాల శివనే చూసుకున్నారు. ఏ ఏరియాలో సినిమాను ఎంతకు అమ్మాలనే విషయాలపై కొరటాలదే ఫైనల్ డెసిషన్.
దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తమకొచ్చిన నష్టాలను కవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొరటాల కూడా ఈ ఇష్యూని త్వరగా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బిజినెస్ వ్యవహారాలు కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ కొరటాలను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ఫ్యాన్స్ మాత్రం #JusticeForKoratalaShiva అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నారు. మరి ఈ విషయం మెగాస్టార్ వరకు వెళ్తుందేమో చూడాలి!