విత్తనాల నుంచే పండ్లు వస్తాయి, కానీ కొన్ని రకాల పండ్లు తినచ్చు కానీ ఆ విత్తనం మాత్రం తినకూడదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. మనం రోజు వారీ తినే పండ్లే అయినా ఎంతో మందికి వాటి విత్తనాలు తినకూడదని తెలియదు.పెద్ద విత్తనాలను తీసి పడేస్తాం. సీతాఫలం పండులోని విత్తనానలు తినమన్నా తినరు, ఎందుకంటే అవి పెద్దగ ఉంటాయి కాబట్టి పడేస్తారు. అలాగే సపోటా పండ్ల విత్తనాలు కూడా తినకముందే చేత్తో తీసేస్తాం. కానీ చిన్న చిన్న విత్తనాల దగ్గరికి వచ్చే సరికి నిర్లక్ష్యం వహిస్తాం. తింటే ఏమవుతుందిలే? పొట్టలో అరిగిపోతాయి అనుకుంటూ వదిలేస్తాం. కానీ కొన్ని విత్తనాలు మాత్రం పొట్టలోకి వెళ్లి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అవే విత్తనాలు అధికంగా చేరితే విషపూరితంగా కూడా మారతాయి. పండ్లు ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు నిండిన పవర్ హౌస్లు. పండ్లు ఆరోగ్యకరమైనవే అయినా వీటి విత్తనాలు మాత్రం చాలా డేంజర్. ఇవి కొందరిలో అనారోగ్యానికి కారణం అవుతాయి.
1. ఆపిల్ పండ్లు
రోజుకో ఆపిల్ పండు తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం తగ్గుతుందని అంటారు పెద్దలు. అది నిజం కూడా. ఈ పండులో పీచు కూడా అధికం. కానీ ఆపిల్ విత్తనాలు చాలా విషపూరితం అవుతాయి. తరచూ వాటిని తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ విత్తనాలు అమిగ్డాలిన్, హైడ్రోజన్ సైనైడ్ ను శరీరంలో విడుదల చేస్తాయి. చాలా ప్రమాదకరమైన రసాయనాలు ఇవి.
2. చెర్రీలు
చెర్రీ పండ్లలో కూడా చిన్న విత్తనాలు ఉంటాయి. ఇవి కూడా శరీరానికి హానిచేసే సమ్మేళనాలు కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. పీచెస్, ఆప్రికాట్లు, రేగు పండ్లలోని విత్తనాలను కూడా తినకూడదు.
3. టొమాటోలు
టొమాటోలు లేకపోతే ఆ రోజు ఏ ఇంట్లనూ వంట పూర్తవ్వదు. కూరల్లో గ్రేవీ రావాలంటే టొమాటోలు కావాల్సిందే. దీనిలో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు కూడా అధికం. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే వాటి విత్తనాలు మాత్రం మూత్రపిండాలకు హానిచేస్తాయి. రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతాయి. టొమాటోలలో ఉండే ఆక్సలేట్ వల్ల ఇలా రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి రోజూ మరీ అధికంగా టమోటోలు తినకుండా మితంగా తినండి.
4. లిచీ
కండ పట్టిన పండు లిచీ. లిచీ పండును అధికంగా తిన్నా అనారోగ్యమే. అలాగే అందులో ఉండే విత్తనాలు తిన్నా ప్రమాదమే. వీటిలో ఉండే ఓ రకమైన అమైనో ఆమ్లాల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. మెదడు వాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.
Also read: టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలను, కోపాన్ని పెంచేస్తున్న వీడియో గేమ్స్, తల్లిదండ్రులూ జాగ్రత్త
Also read: ఈ నాలుగు పానీయాలు మీ తలనొప్పిని తీవ్రంగా మారుస్తాయి, తాగకపోవడం మంచిది