రక్తం నుంచి వ్యర్థాలు, ద్రవాలు ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ కొంతమంది సరిగా పట్టించుకోవడం వల్ల సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం. ఈ పరిస్థితి ఉన్న వాళ్ళు ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. ఆహారం విషయంలోని జాగ్రత్తలు తీసుకోవాలి. కొదనీ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుని సరైన చికిత్స తీసుకుంటే త్వరగా వ్యాధిని తగ్గించుకోవచ్చు.


ప్రాసెస్ చేసిన మాంసం


ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. ఇవి వేయడం వల్లే మాంసం రుచిగా ఉంటుంది. కానీ జంతు ప్రోటీన్ అతిగా తీసుకోవడం వల్ల హైపర్ ఫిల్ట్రేషన్ కి దారి తీస్తుంది. మూత్రపిండాల మీద భారం పడుతుంది. అందుకే వాటికి బదులుగా మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం మంచిది.


ఊరగాయలు


నోటికి ఎంతో రుచిగా ఉండే ఊరగాయలు అధిక సోడియం కంటెంట్ తో ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా ఊరగాయలకి దూరంగా ఉండాలి.


అరటిపండ్లు


అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండుని నివారించడం మంచిది. బదులుగా పైనాపిల్ తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, ఫైబర్, భాస్వరం, సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిని అవసరమైన ఖనిజాలు అందిస్తాయి.


బంగాళాదుంపలు


బంగాళాదుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవాలని అనుకున్నప్పుడు రాత్రిపూట నీటిలో నానబెట్టడం చేయాలి. అలా చేయడం వల్ల పొటాషియం తగ్గిస్తుంది. వీలైనంత వరకు వాటిని తక్కువగా తీసుకోవడం మంచిది.


చక్కెర పానీయాలు


తీపి సోడా, కోలాస్ తాగడం మానేస్తే మంచిది. వీటిలో అధిక మొత్తంలో ఫాస్పేత్ ఉంటుంది. ఇవి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేలా చేస్తాయి. అది మాత్రమే కాదు వీటిలో అధిక స్థాయిలో ఫ్రక్టోజ్ ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళని మరింత పెంచుతుంది. అందుకే ఈ ఆహారాలు మూత్రపిండాల పరిస్థితిని మరింత దిగజారుస్తాయి.


అధిక సోడియం ఆహారాలు


అధిక ఉప్పు వినియోగం రక్తపోటుని పెంచుతుంది. మూత్రపిండాలని ఒత్తిడికి గురి చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు ప్రాసెస్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ సూప్, ఫాస్ట్ ఫుడ్ తో సహా అధిక సోడియం కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులు సంపూర్ణ ఆహారాల్ని ఎంచుకోవాలి.


రెడ్ మీట్


రెడ్ మీట్, సాసేజ్, బేకన్ వంటి మాంసాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో వ్యర్థ పదార్థాల పెరుగుదలకి దారి తీస్తాయి. కినదీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు చేపలు, ఫౌల్ట్రీ లేదా మొక్కల ఆధారిత ఎంపికలు చేసుకోవాలి.


పాల ఉత్పత్తులు


పాల ఉత్పత్తుల్లో భాస్వరం ఉంటుంది. ఇది కిడ్నీ వ్యాధి ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. బాదం పాలు వంటి తక్కువ ఫాస్పరస్ ఉండే డైరీ ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.


ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు


కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ఆక్సలేట్ దోహద పడతాయి. బచ్చలికురా, దుంపల్లో అధిక మొత్తంలో ఆక్సలెట్ ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వేన్నీళ్లు తాగుతున్నారా? ఈ ప్రమాదం తప్పదట, జాగ్రత్త!