World Vegan Month 2024 : ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ నెలను వీగన్​ నెలగా చెప్తారు. నాన్​వెజ్​కి దూరంగా ఉండాలనుకునేవారు.. జంతుహింసను వద్దనుకునేవారు వీగన్స్​గా మారుతూ ఉంటారు. వీరంతా వీగన్​ ఫుడ్​పై అవగాహన కల్పిస్తూ నవంబర్ 1వ తేదీన ప్రపంచ వీగన్ డే(World Vegan Day)గా నిర్వహిస్తున్నారు. అయితే నవంబర్ 1 నుంచి 30వ తేదీవరకు.. నెల మొత్తాన్నీ వీగన్ నెలగా (World Vegan Month) చెప్తారు. 1994 నుంచి దీనిని నిర్వహిస్తున్నారు. కాగా 2024 సంవత్సరంతో ఈ వీగన్ మూమెంట్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వీగన్​గా మారడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


వీగన్​ నెల ప్రాముఖ్యత


వీగన్ వల్ల కలిగే లాభాలు చెప్తూ.. ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే యానిమల్ రైట్స్, వెల్పేర్​ను ప్రమోట్ చేస్తారు. మొక్కల ఆధారిత ఫుడ్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఈ వీగన్ మంథ్​ని జరుపుతున్నారు. వీగన్ కమ్యూనిటీలను, బిజినెస్​ను సపోర్ట్ చేస్తూ.. వీగన్ ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. 


వీగన్ వల్ల కలిగే ప్రయోజనాలు.. 


నాన్​వెజ్​కి దూరంగా ఉండడం. పర్యావరణానికి నష్టం కలిగించని జీవనశైలిని ఫాలో అవ్వడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, బరువు తగ్గడం అనేవి వీగన్ డైట్​తో సాధ్యం. అంతేకాకుండా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల సూపర్ ఎనర్జీటిక్​గా ఉంటారు. హార్ట్ సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. గట్ హెల్త్​కి మంచిది. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెరుగుతుంది.



వీగన్ డైట్​ని ఎన్ని రకాలంటే.. 


Whole food vegan diet.. దీనిలో భాగంగా పూర్తిగా మొక్కల ద్వారా ఉత్పతయ్యే ఫుడ్ మాత్రమే ఉంటుంది. పండ్లు, కూరగాయలు, మల్టీ గ్రెయిన్స్, పప్పులు, నట్స్, సీడ్స్​ని తీసుకోవచ్చు. 


Raw food vegan diet.. ఈ డైట్​లో పచ్చి కూరగాయలు, పండ్లు, నట్స్, సీడ్స్, ఆకు కూరలు.. తక్కువగా ఉడికించినవి మాత్రమే తీసుకుంటారు. 


80/10/10 diet.. ఈ డైట్​లో భాగంగా.. ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. నట్స్, అవకాడో, పండ్లు, సాఫ్ట్ గ్రీన్స్ ఉండే ఫుడ్​ని మాత్రమే తీసుకుంటారు. 


Starch solution.. ఇది లో ఫ్యాట్, హై కార్బ్ వేగన్ డేట్. ఇది కూడా 80/10/10 డైట్​కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ డైట్​లో బంగాళదుంపలు, అన్నం, మొక్కజొన్న, పండ్లు కూడా తీసుకుంటారు. 


Raw till 4.. ఈ డైట్​ కూడా 80/10/10 డైట్ మాదిరిగానే ఉంటుంది. కాకుంటే.. వండని వేగన్ ఫుడ్స్ తీసుకుంటారు. కానీ సాయంత్రం 4 తర్వాత తీసుకోరు. ఉడికించిన వేగన్ ఫుడ్​ని మాత్రం డిన్నర్​గా తీసుకుంటారు.



ఇవే కాకుండా థ్రైవ్ డైట్, జంక్​ఫుడ్ వీగన్ డైట్​ వంటి ఎన్నో డైట్స్​ వీగన్​లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల ఫుడ్ తీసుకోవడం ఫన్నీగా, ఇంట్రెస్టింగ్​గా ఉంటుందని చెప్తున్నారు. వీగన్​ డైట్​ని ఫాలో అవుతూ చాలామంది బరువు తగ్గుతున్నారు. మరికొందరు ఫిట్​గా మారుతున్నారు. అలాగే కొందరిలో ఇది విటమిన్స్ లోపానికి కూడా కారణమవుతుందని చెప్తున్నారు. మీరు కూడా వీగన్ డైట్​ ఫాలో అవ్వాలనుకుంటే నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ప్రారంభిస్తే మంచిది. 



Also Read : మెడిటేషన్​తో బరువు కూడా తగ్గొచ్చట.. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయట