World Lung Cancer Day 2025 : క్యాన్సర్ మరణాలకు ప్రధానంగా కారణమవుతోన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఏడాది ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ రాకుండా ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి.. వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికిత్స విధానం ఏంటి వంటి విషయాలు తెలుసుకుందాం.
ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవ చరిత్ర
ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డేని 2012లో ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (Forum of International Respiratory Societies), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అవగాహన కల్పిస్తున్నాయి. లంగ్ క్యాన్సర్ ముందుగానే గుర్తిస్తే.. దానికి సరైన జాగ్రత్తలు తీసుకుని.. హెల్తీగా ఉండవచ్చు.
ప్రపంచం వ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ఊపిరితిత్తులే ప్రధానకారణంగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ సమస్యపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిని ముందస్తుగా గుర్తించడం నుంచి.. వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలవరకు ఏమి ఫాలో అవ్వాలి. ముందుగా గుర్తిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానం వంటి అంశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రాణాంతకమా?
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణాలలో ఒకటి. రోజురోజుకి మరణాలు ఎక్కువ అవుతున్నాయని గుర్తించారు. ఇది అధునాతన దశకు చేరుకునే వరకు దానిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ధూమపానం చేసేవారిని, ధూమపానం చేయనివారిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ ధూమపానం ప్రమాదాకరంగా చెప్తారు. లంగ్ క్యాన్సర్ అనేది స్మోక్ చేసేవారిని, చేయని వారిని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ముందస్తు స్టేజ్‌లో దీనిని గుర్తించకపోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదకరంగా మారవచ్చు. సిగరెట్ అనేది దీని ప్రమాదం మరింత పెంచుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే స్మోకింగ్ మానేయడం. అలాగే సెకండ్ స్మోకింగ్కి కూడా దూరంగా ఉండాలి. కాలుష్య సంబంధిత ప్రాంతాల్లో తిరగడం తగ్గించాలి. హాని చేసే కెమికల్స్ ఉండే ప్రాంతంలో మాస్క్ వేసుకుని తిరగాలి.
ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కణాల దెబ్బతినకుండా కాపాడుకోవడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అలాగే రోజూ వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
లంగ్ క్యాన్సర్ లక్షణాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ సమయంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు రావడం, ఛాతిలో నొప్పి రావడం, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు.. అనుకోకుండా బరువు తగ్గిపోవడం, ఫటిగో వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే సమస్య ఉన్నా లేకున్నా.. రెగ్యులర్‌గా స్క్రీనింగ్స్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్‌ని ముందుగా గుర్తించి.. దానికి తగిన చికిత్స అందించే వీలు ఉంటుంది. ఎంత త్వరగా సమస్యను గుర్తిస్తే.. అంత ప్రమాదం తగ్గుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.