Warning Signs and Symptoms of Fatty Liver : కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యేవరకు వాటి గురించి తెలుసుకోలేము. పరిస్థితి తీవ్రమయ్యాక వాటికి చికిత్స చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే ముందే కాలేయ సమస్యలను గుర్తించాలంటూ.. కాలేయ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తి, అవగాహనకు ముఖ్యపాత్రనిస్తూ.. ఏటా ఏప్రిల్ 19వ తేదీన కాలేయ దినోత్సవం(World Liver Day 2024) నిర్వహిస్తున్నారు. 


కాలేయం అనేది మానవ శరీరంలో అంతర్భాగం, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో కీలకమైన చర్యలు చేస్తూ.. హెల్తీగా ఉండడంలో సహాయం చేస్తుంది. అయితే దీనికి ఏదైనా సమస్య వస్తే ముందుగా గుర్తించడం చాలా కష్టం. వాటిలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. మెజారిటీ పీపుల్ ఈ సమస్యతో ఎక్కువ ఇబ్బంది పడతారు. అందుకే కొవ్వు కాలేయ సమస్యపై దాని సంకేతాలు, లక్షణాలు, చికిత్సపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫ్యాటీ లివర్ సంకేతాలు ఏంటి? ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాలేయాన్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కాలేయ సమస్యలకు ప్రధాన సంకేతాలు


మూత్రం రంగు మారిపోవడం ఫ్యాటీ లివర్​ సమస్యకు ప్రధాన సంకేతం. కాలేయంలో సమస్యలు ఉన్నా.. కొవ్వు కాలేయ వ్యాధులు ఉన్న మూత్రం రంగు మారిపోతుంది. దీనిని మీరు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల కూడా మూత్రం రంగులో మార్పు ఉండొచ్చు. బరువు తగ్గడం కూడా ఫ్యాటీ లివర్​ సమస్యలో భాగమే. అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఎలాంటి డైట్ ఫాలో అవ్వకుండా బరువు తగ్గిపోతే వైద్యుడి దగ్గరికి వెళ్లండి. ఇవి ఫ్యాటీ లివర్, కాలేయం పని చేయకపోవడాన్ని సూచనగా చెప్తారు. 


పొత్తికడుపులో ఇబ్బందిగా, భారంగా ఉందా? అయితే ఫ్యాటీ లివర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అర్థం. ఎలాంటి సమస్యలు లేకుండా వాంతులు ఎక్కువగా అయితే కాలేయంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సంకేతాలు ఉంటే దాని అర్థం మీకు ఫ్యాటీ లివర్ ఉందని అర్థం కాదు. కానీ ఈ సంకేతాలు మీరు గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాలని అర్థం. వైద్యుల సలహా తీసుకోవడం వల్ల ఒకవేళ సమస్య ఉంటే.. వెంటనే చికిత్స చేయవచ్చు. లేకుంటే తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


మెడికల్ చెకప్స్ చేయించుకోకుంటే..


రెగ్యూలర్​గా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు. సమస్యను గుర్తిస్తే మరింత జాగ్రత్తగా దానిని తగ్గించుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు.. అధిక బరువు ఉన్నవారు కాలేయ పనితీరుపై పరీక్షలు, అల్ట్రాసౌండ్ టెస్ట్​లు చేయించుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కాలేయ సమస్యలను ముందుగా గుర్తించడంలో హెల్ప్ అవుతుంది.



వాటికి దూరంగా ఉండాలి..


జీవనశైలిలో మార్పులు.. బరువు తగ్గడం, హెల్తీ బరువును మెయింటైన్ చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం చేయాలి. బాగా ఫ్రై చేసిన, బేకరీ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు వివిధ పనులతో పాటు వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆల్కహాల్ అలవాటు ఉంటే.. వెంటనే దానిని మానుకోవాలి. హెల్తీ లివర్​ అనేది మొత్తం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని గుర్తించాలి.


 Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లిని తిన్న తల్లి.. నక్క​ పోలికలతో జన్మించిన పిల్లాడు, పిల్లే దీనికి కారణమా?