Guppedanta Manasu Today Episode: మనూని దత్తత తీసుకోవటం గురించి   అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళి చెపుదామని మహేంద్ర తన కోడలు వసుధారతో కలిసి బయలుదేరుతాడు. కారులో  వసు , మహేంద్ర తో


వసుంధర: మావయ్య మీరు తీసుకునే నిర్ణయం వల్ల అనుపమ చాలా బాధపడుతున్నట్టు ఉంది.


మహేంద్ర: కొత్తగా బాధపడేది  ఏముంది అమ్మ. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది. కానీఇన్ని రోజులు  మనకి ఆ విషయం తెలియలేదు. అందుకే అంటారేమో బయట ప్రపంచానికి కనిపించే మనిషి వేరు. లోపల ఉండే మనిషి వేరు అని. అనుపమ కూడా ఇన్నాళ్లు అదే పరిస్థితిలో ఉంది. ఇన్నాళ్లు తను సంతోషంగా ఉన్నట్టు, మన సమస్యలు తీరుస్తున్నట్టు  కనిపించింది.  కానీ తనకి ఇంత పెద్ద సమస్య ఉందని తను ఎప్పుడు బయటపడలేదు. అది మొన్న అనుకోకుండా తనమీద ఎటాక్ జరగడం వల్ల, మను తనని అమ్మ అని పిలవడం వల్ల, అన్ని నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తనని ఆ సమస్య నుండి దూరం చేయాలని,  ఆ బాధనుండి బయటపడేయాలని నా ప్రయత్నం. అంతేతప్ప ఇందులో మరే ఉద్దేశం లేదమ్మా . 


వసుంధర: మీ ప్రయత్నం  మీరు చేయొద్దు అని చెప్పట్లేదు మావయ్య. కానీ దత్తత తీసుకోవడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఇది చాలా కఠినమైన నిర్ణయము ఏమో... 


మహేంద్ర: కొన్ని కఠిన నిజాలు బయటపడాలి అంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అమ్మ.. మనం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే గాని నిజం  బయటపడదు. 


వసుంధర: కానీ ఇప్పుడు దీనివల్ల కొత్త సమస్యలు వస్తాయేమో కదా మావయ్య. 


మహేంద్ర: ఏ సమస్యలు అమ్మ


వసుంధర: ఒకవేళ మను అసలు తండ్రి వల్ల  ప్రాబ్లం వస్తుంది ఏమో.


మహేంద్ర: బయటికి రావాలనే  కదా నా యొక్క ప్రయత్నాలు అన్ని. నేను కనీసం ఇలా చేస్తే అయినా  అనుపమ నోరు తెరుస్తుంది ఏమో, నిజం చెబుతుందేమో, అని నేను ఇంతవరకు వచ్చాను అమ్మ. ఇన్నాళ్లు నువ్వెలా అడిగావో నేను కూడా అలాగే అడిగాను.. సామ దాన బేద దండోపాయాలు అంటారు కదా.. అందుకే నేను దానీ ప్రకారమే తనని రిక్వెస్ట్ చేయడం, గట్టిగా అడగడం, నచ్చ చెప్పడం,  కోపంగా అడగటం చేశాను. కానీ తను మాత్రం నిజం బయట పెట్టడం లేదు. అందుకే ఇప్పుడు ఇలా ప్లాన్ చేశాను. అనుపమ నోరు తెరిచి నిజం చెప్పడం ఆలస్యం.  మను తండ్రిని తీసుకొచ్చి తన ముందు నిలబెడతాను. లేదంటే మనో తండ్రి వచ్చేంతవరకు తనకి నేనే తండ్రిగా ఉంటాను. అందుకే మనూని ఇలా దత్తత తీసుకుంటున్నాను. అనుపమకి  లోకంలో ఎలాంటి మాట రాకుండా చేస్తాను. నేను మనో కి నిజమైన తండ్రిని కాకపోవచ్చు. కానీ మనకు ఒక తండ్రిగా ఉంటాను. ఒక తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలని నేను  నెరవేరుస్తాను. ఒక కుటుంబాన్ని ఒక తండ్రి ఏవిధంగానైతే అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాడో.. నేను కూడా వాళ్లకి ఆ విధంగా భరోసా కల్పించాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.


అని అన్నయ్య ఇంటికి  చేరుకుంటారు. అక్కడ లోపలి వెళుతూ .. 


మహేంద్ర: వసుధార .. రామ్మా 


కోడలు: మావయ్య ఇంకొకసారి ఆలోచించండి 



మహేంద్ర: ఇందులో ఆలోచించేది అయితే ఏమీ లేదు. నువ్వేం కంగారు పడకమ్మా మనకు అంత మంచిదే జరుగుతుంది. 


ఇంట్లోకి వెళ్ళి తన నిర్ణయం చెబుతాడు మహేంద్ర. వద్దు  అని చెప్పటానికి అన్నయ్య, వదిన, శైలేంద్ర  కన్విన్స్ చేయటానికి ప్రయత్నింస్తారు. మహేంద్ర వినిపించుకోడు. మహేంద్ర అన్నయ్య ఫణీంద్ర కూడా దత్తత కాకుండా వేరే ఏదన్నా చేస్తే బాగా ఉండేది అంటాడు.  కానీ మహేంద్ర అన్నయ్యను క్షమించమని, తన నిర్ణయం మారదని చెబుతాడు.   నేను మీకు ఇన్ఫర్మేషన్  ఇవ్వటానికి వచ్చాను. తప్పకుండా అందరూ రండి అని చెప్పి వెళ్ళిపోతాడు. 


మహేంద్ర వెళ్ళిపోయాక  శైలేంద్ర మనుకి ఫోన్ చేసి ఎందుకు ఇంత ప్లాన్ వేశావ్.. ఎవరిది అసలీ  ప్లాన్ అని అడుగుతాడు.శైలేంద్ర  చాలా తెలివిగా  మీ వెనకాతల ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు మా ఫ్యామిలీ తో ఇలా ఆడుకుంటున్నారు అంటూ  మనుని రెచ్చగొడతాడు. మను అనుపమ దగ్గరికి వెళ్ళి మహేంద్ర గురించి  ప్రశ్నిస్తాడు. 


మరోవైపు శైలేంద్ర  తల్లితో  మహేందర్ ను దెబ్బకొట్టడం ఇప్పుడు మరింత సుళువు అని చెబుతాడు.