Jagadhatri Today Episode:ఫేక్ వీడియో రావటంతో కౌశిక టెన్షన్ పడుతూ  ఉండటం చూసి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి ఆఫీస్ కి బయలుదేరతారు ధాత్రి, కేదార్, కౌశికి.  వాళ్లతోపాటు వెనుక  యువరాజ్  కూడా బయలుదేరుతాడు.  కౌశికి టీమ్ మెంబర్స్  అందరితో ఈ విషయం  మాట్లాడుతుంది.  ధాత్రి ఉద్యోగులందరినీ   హార్డ్ డిస్క్ గురించి విడివిడిగా ప్రశ్నిస్తుంది.  తరువాత సీ సీ టివి ఫుటేజ్ లో విజయ్ అనే వ్యక్తి   టెన్షన్ పడుతూ ఉంటాడు. దానిని అబ్జర్వ్ చేస్తుంది ధాత్రి. యువరాజు దూరం నుండి చూసి ధాత్రి పోలీస్ ఆఫీసర్ కాదు అని పిళ్లై అన్నాడు కానీ ఇక్కడ అంతకన్నా వేరే లెవల్లో పెర్ఫార్మన్స్ చేస్తుందని అనుకుంటాడు.    కౌశికి కేబిన్ లో ముగ్గరు కూర్చుంటారు. 


కేదార్: సీసీ కెమెరాలు ఆ టైంకి ఆఫ్ చేశారు. దాని ముందు 30 మినిట్స్ ఫుటేజ్ డిలీట్ చేశారు అక్క.


కౌశిక: ఇదంతా నా ఆఫీసులో ఒకరు చేశారని తలుచుకుంటుంటేనే కోపంకట్టలు తెంచుకుంటోంది.


ధాత్రి: అసలు ఇదంతా మినిస్టర్ ఒక్కడి ప్లాన్ ఏనా.. లేదా ఇందులో ఇంకెవరిదైనా హస్తం ఉందా  లేదా  తెలుసుకోవాలి వదినా. 


కౌశిక: ఆఫీసులో తప్పు చేసినవారు  ఎవరో కనిపెట్టి, తన వెనకాతల ఉన్నది ఎవరో కనిపెట్టి అతనికి, మినిస్టర్ కి లింకు కనుక్కొని మినిస్టర్  మోసం చేశాడని ప్రూవ్ చేయటానికి మనకి ఉన్నది ఒక్కరోజు. కొంచెం అటు ఇటు అయినా ఛానల్ ని  కాపాడుకోలేము జగదాత్రి.


ధాత్రి: అంత దూరం రానివ్వను వదిన. నేను మాటిస్తున్నాను. ఇందాక మేము కలిసిన వాళ్ళల్లో విజయ్ అని ఒక గ్రాఫిక్స్ టీం అబ్బాయి ఉన్నాడు. అతను ఎందుకో  చాలా టెన్షన్ మీద ఉన్నాడు. నేను తనని డీటెయిల్స్ అడుగుతుంటే తన కళ్ళల్లో భయం క్లియర్ గా కనిపించింది. 


కౌశిక: అయితే పిలిపించి అడుగుదాం 


కేదార్: అడగటం వల్ల ఉపయోగం లేదక్కా. తెలీదంటాడు. పైగా జస్ట్ టెన్షన్ పడ్డాడు అని తనని అనుమానించలేము. ఈ ఛానల్లో వందల మంది పనిచేస్తున్నారు. అందులో ఎవరైనా అయ్యుండొచ్చు. ఇది నా అనుమానం మాత్రమే అక్క. 


ధాత్రి: మనకి కావలసినది తప్పు చేసిన వాడు మాత్రమే కాదు వదిన. వాడు దొంగలించిన హార్డ్ డిస్క్ కూడా. అది ఉంటేనే మనం ఈ ప్రాబ్లం నుండి బయటపడగలము. 


కౌశిక: విజయ్ ని క్లోజ్ గా అబ్సర్వ్ చేయమని చెబుతాను.


ధాత్రి: సరే వదిన.


కేదార్: పిల్లై గారు వీడియో గురించి ఏం చెప్పారు.


ధాత్రి: మనకి వీడియో పంపగానే హెడేక్ ఎందుకు అని వీడియో డిలీట్ చేసేసారట.


కేదార్: ఇప్పుడు మనకి పోయిన హార్డ్ డిస్క్ ని పట్టుకోవడం తప్ప లేక ఆప్షన్ లేదు ధాత్రి .


ధాత్రి: ఆ హార్డ్ డిస్క్ ని ఎలాగైనా పట్టుకుని తీరాలి. 


యువరాజ్ : వీళ్లు ఆ హార్డ్ డిస్క్ వెదుకుతున్నారని వెంటనే భాయ్ కి చెప్పాలి.


కౌశికి కి మినిస్టర్ హరినాథ్ 50 కోట్లు అడగడంతో ఇంట్లో అందరితో కలిపి సమావేశమై తన దగ్గర ఉన్న ల్యాండ్ ని అమ్మకానికి పెడుతుంది. అమ్మకానికి వచ్చిన వాళ్ళు సిటీ అవుట్ కట్స్ ల్యాండ్ కాదు గచ్చిబౌలిలో ఉన్న ల్యాండ్ కావాలి అని అడుగుతారు. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా  వాళ్లు కోరుకుంటున్న  ల్యాండ్ ని వాళ్ళకి  ఇచ్చేస్తానంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇదంతా ధాత్రి,  కౌశిక్,  కేదార్ల ప్లాన్ అని తెలియక గాబరా పడుతుంటారు.


మరో  మీడియా ఛానల్ ఎం.డి. దివ్య,  నిషిక చిన్ననాటి స్నేహితురాలు కావడంతో ఆమెకి కాల్ చేస్తుంది. అఖిలాండేశ్వరికి అకాడమీకి ఇస్తానన్న ల్యాండ్ అమ్మకానికి పెడుతున్నారన్న విషయాన్ని ఎలా అయినా అఖిలాండేశ్వరికి చేరవేయమంటుంది. సరేనని చెబుతుంది దివ్య