ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే ఆడవారి సంఖ్య పెరిగింది. వర్క్ ప్లేస్లో పురుషు,లు మహిళలు అనే తేడా లేకుండా పని ఒత్తిడి అందరి పైనా ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే పని ఒత్తిడి మహిళలనే తీవ్ర సమస్యలకు గురయ్యేలా చేస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా వారు తీవ్రమైన అలసట, నిద్ర రుగ్మతలు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉన్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.


స్విట్జర్లాండ్లోని శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం పురుషుల కంటే మహిళల్లో ఒత్తిడి వేగంగా పెరుగుతుంది. త్వరగా పని చేస్తుంది. అందుకే వీరిలో గుండెపోటు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంట్లోని బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూస్తూనే ఉద్యోగం చేయడం వల్లే మహిళల్లో ఎక్కువగా ఒత్తిడి కలుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్లో ఈ అధ్యయనం తాలూకు నివేదికను అందించారు. స్విట్జర్లాండ్లోని పురుషులు, మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2007 నుండి 2017 వరకు 22 వేల మంది పురుషులు, మహిళల ఆరోగ్య డేటాను సమీకరించారు. వాటిని పోల్చడం ద్వారా ఈ అధ్యయనానికి ఒక తుది తీర్పును ఇచ్చారు. 


పని ఒత్తిడి అధికంగా ఉన్నట్టు 2017లో 66% మంది, 2012లో 59 శాతం మంది చెప్పారు. అలాగే 2012లో పని ఒత్తిడి అధికంగా ఉన్నట్టు 38% మంది మహిళలు చెప్పగా, 2017లో 44% అధికంగా ఉన్నట్టు చెప్పారు. అదే పురుషుల్లో కేవలం 26% మందే ఒత్తిడి అధికంగా ఉన్నట్టు చెప్పారు.


మహిళలు తమకు ఒత్తిడి వల్ల నిద్రా సమస్యలు వస్తున్నట్లు వివరించారు. పురుషులు కేవలం ఐదు శాతం మందే ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోతున్నామని వివరించారు. మహిళలు మాత్రం ఎనిమిది శాతం మంది ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.


ఈ సమస్యలు వచ్చే అవకాశం
అధిక ఒత్తిడి కారణంగా మహిళలు కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంది. 


అధిక రక్తపోటు 
నిద్ర లేకపోవడం 
జీర్ణక్రియ సరిగా జరగకపోవడం 
చిరాకు 
అందరిలో కలవకపోవడం 
ఏకాగ్రత లేకపోవడం 
కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవడం 


కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ఒత్తిడి  తగ్గించుకునేందుకు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అరగంట వాకింగ్, ఓ పావుగంట రన్నింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు పచ్చని పరిసరాల్లో గడపాలి. కామెడీ కార్యక్రమాలు చూడాలి. దీని వల్ల నవ్వు పుట్టి, సంతోషాన్ని నింపే హార్మోను శరీరంలో విడుదలవుతుంది. తాజా ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, చిరుధాన్యాలు తినాలి. స్పైసీ, మసాలా ఫుడ్ కు దూరంగా ఉండాలి. 



Also read: చరిత్రలో నిలిచిపోయే విషాదం టైటానిక్, ఆ ప్రయాణికులు చివరగా తిన్న ఆహారం ఇదే



Also read: మామిడిపండును తిన్నాక నీళ్లు తాగితే ఇలా జరిగే అవకాశం





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.