Woman Spends Rs 9.4 Lakh On Starbucks Coffee: ఫుడ్ డెలివరీ యాప్ వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో వంటలు చేయడమే మర్చిపోతున్నారు. చీటికి మాటికి జొమాటో, స్విగ్గీ, ఉబర్ ఈట్స్ అంటూ ఇంట్లో ఉండే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. నచ్చిన ఆహారం బయటి నుంచి తెప్పించుకుని మెక్కేస్తున్నారు. అయితే, ఎక్కువ ఆర్డర్స్ ఇస్తున్న కస్టమర్లను గుర్తించి ఆయా యాప్స్ వారికి సర్ ప్రైజ్ ఇస్తున్నాయి. తమ యాప్స్ ద్వారా ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు చేసిన వారిని పిలిచి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ జొమాటో ద్వారా ఏకంగా రూ. 9.4 లక్షల విలువ చేసే స్టార్ బక్స్ కాఫీ ఆర్డర్లు చేయడంతో అందరూ షాక్ అయ్యారు.
స్టార్ బక్స్ కాఫీ కోసం రూ. 9.4 లక్షలు ఖర్చు చేసిన యువతి
కాఫీ తాగాలనిపిస్తే.. కస్టమర్లు ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటారు. ఒక్కోసారి రూ. 5 వందల వరకు ఖర్చు అవుతుంది. కానీ, ఓ మహిళ ఏకంగా కాఫీల కోసం ఏకంగా రూ. 9.4 లక్షలు ఖర్చు చేసింది. ముంబైకి చెందిన మిష్కత్ అనే మహిళకు స్టార్ బక్స్ కాఫీ అంటే చాలా ఇష్టం. రోజూ జొమాటో యాప్ ద్వారా కాఫీ ఆర్డర్ చేసుకునేంది. అలా ఆమె కాఫీ కోసం ఏకంగా రూ. 9.4 లక్షలు ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో జొమాటో సంస్థ ఆమెను స్పెషల్ కస్టమర్ గా గుర్తిస్తూ ఓ యాడ్ ను రూపొందించింది. ఆ యాడ్ లో మిష్కత్ మదర్ గా ఓ మహిళ నటించింది. ఆమె జొమాటో పంపిన థ్యాంక్స్ కార్డును పట్టుకుని ఆఫీస్ కు వెళ్తుంది. జొమాటో మార్కెటింగ్ హెడ్ కు చూపించి ఇదేంటి అంటూ అరిచి గోల చేస్తుంది. అంతేకాదు, తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని పంచాయితీ చేస్తుంది.
మిష్కత్ పేరుతో స్పెషల్ కూపన్ ప్రారంభం
ఈ నేపథ్యంలో జొమాటో టీమ్ ఆమెకు స్టార్ బక్స్ కాఫీ టేస్ట్ చూపిస్తారు. ఆ కాఫీ రుచి చూసి ఆమె ఆశ్చర్యపోతారు. అందుకే, మిష్కత్ అన్ని కాఫీలు ఆర్డర్ చేసిందనే విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా చేస్తారు. ఈ యాడ్‌లో మిష్కత్ ఒరిజినల్ మదర్ ను కూడా చూపిస్తారు. ఇకపై మిష్కత్ తో పాటు ఆమె తల్లి కూడా స్టార్ బక్స్ లో కాఫీ ఆర్డర్ చేస్తారంటూ యాడ్ ను చిత్రీకరించారు. అంతేకాదు, మిష్కత్ పేరుతో ఓ కూపన్ కోడ్ ను కూడా క్రియేట్ చేశారు. ‘మిష్ 100’ పేరుతో స్టార్ బక్స్ లో కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసే వారికి రూ. 100 ఆఫర్ ఇస్తోంది. మొత్తంగా మిష్కత్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు, మిష్కత్ గురించి నెటిజన్లు జోరుగా సెర్చ్ చేస్తున్నారు.
Read Also: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి