సోషల్ మీడియాలో మీరు చాలా సార్లు చూసే ఉంటారు. చేతి మీద, చర్మం మీద చిన్న రంథ్రాలు ఏర్పడిన ఫొటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఒక పురుగు వల్ల చర్మం చేతిపై రంథ్రాలు అయ్యాయనే ప్రచారం జరిగింది. వాస్తవానికి.. అలా చర్మానికి రంథ్రాలయ్యే వ్యాధి అంటూ ఏదీ లేదు. కానీ, అలాంటి రంథ్రాలను చూస్తే భయపడే వ్యాధి మాత్రం ఉంది. దాన్నే ‘ట్రైపోఫోబియా’ (trypophobia) అంటారు. ఈ వ్యాధి ఉన్నవారు చిన్న చిన్న రంథ్రాలను చూసి భయపడిపోతుంటారు. చివరికి తేనె తుట్ట, స్పాంజ్‌లను చూసినా సరే వణికిపోతుంటారు. ఇంతకీ ఏంటీ సమస్య? అనేది తెలుసుకుందాం.
ఈ trypophobia గురించి ముందుగా తెలుసుకోడానికి ముందు.. మనం ఒక మూవీ గురించి మాట్లాడుకోవాలి. 2017లో విడుదలైన ‘అమెరికన్ హారర్ స్టోరీ: కల్ట్’ అనే టీవీ సీరిస్‌లో నటి సారా పాల్సన్ ఈ ఫోబియాతో బాధపడుతుంది. ఆమె శరీరంపై గుండ్రని పుండ్లు పడి.. వాటి నుంచి కీటకాలు బయటకు వస్తున్నట్లుగా ఆమె పీలవుతూ ఉంటాయి. ఆ సీన్స్ చూడటానికి కూడా చాలా వెగటుగా ఉంటాయి. ఆ సీరిస్ చూసినవారికి తప్పకుండా ట్రైపోఫోబియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేనె తుట్టలాంటి వస్తువులను, ఒకే చోట ఉండే గుండ్రని రంథ్రాలన సమూహాన్ని చూసినప్పుడు.. వారిలో ఏదో తెలియని ఆందోళన నెలకొంటుంది. అది క్రమేన మానసిక సమస్యగా మారుతుంది. మీరు కూడా ఈ సీరిస్ చూసేందుకు ప్రయత్నించండి. అలాంటి సీన్లు చూస్తున్నప్పుడు మీకు అసహ్యంగా అనిపిస్తే.. మీకు కూడా ఆ ఫోబియా ఉన్నట్లే.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోబియా ఎంతమందికి ఉంది?
కొంతమందికి బల్లులు, పాములను చూస్తే భయం. ఒక్కసారి వాటిని చూశారంటే.. చాలు, అవి తమపై పాకుతున్నట్లుగా భావిస్తారు. ఏదో జరిపోతుందనే ఆందోళనతో ఉంటారు. మరికొందరు ఎత్తులను చూసి భయపడుతుంటారు. ఇవన్నీ కామన్ ఫోబియాలు. అయితే, ఇలా గుండ్రని రంథ్రాల సమూహాలను చూసి భయపడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే.. ది కెంటుకీ సెంటర్ ఫర్ యాంగ్జయిటీ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్‌కు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచ జనాభాలో 19 శాతం మంది ప్రజలు వివిధ రకాల ఫోబియాలతో బాధడుతున్నారు. వారిలో ట్రిపోఫోబియా కలిగిన వ్యక్తులు 2 శాతం వరకు ఉండవచ్చని పేర్కొన్నారు.
ట్రిపోఫోబియా వల్ల కలిగే నష్టాలేమిటీ?
వాస్తవానికి చర్మంపై తేనె పుట్టలాంటి రంథ్రాలు పడే జబ్బు అంటూ ఏదీ లేదు. కేవలం అది ఊహ, భయం మాత్రమే. ఈ ఫొబియా ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికే భయపడతారట. ఒక వేళ వెళ్లినా.. చిన్న చిన్న గుండ్రని బొడిపెలు లేదా గుత్తులా ఉండే స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్‌లను చూసి కూడా ఆందోళనకు గురవ్వుతారట. కొందరైతే కళ్లు తిరిగి కిందపడిపోతారు. అందుకే, ఇలాంటి ఫొబియా ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలని, మానసిక వైద్యులను సంప్రదించాలని నిపుణులను చెబుతున్నారు.
మరి చికిత్స ఏమిటీ?
ట్రిపోఫోబియాతో పోరాడుతున్నవారికి ఎక్స్‌పోజర్ థెరపీ అందుబాటులో ఉంది. బాధితులు ఏ పనులైతే చేయకూడని అనుకుంటారో ఆ పనులను చేయిస్తారు. అలా వారిలో ఫొబియా నుంచి బయటకు తీసుకొస్తారు. మీరు చూస్తున్నాది, భావిస్తున్నది అంతా భ్రమే అనేలా థెరపీ ఇస్తారు. అయితే, ఈ థెరపీ చాలా బాధకరమైనదని, కానీ హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ థెరపీతోపాటు గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్‌మెంట్ ద్వారా కూడా నయం చేయొవచ్చు. దీన్నే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని కూడా అంటారు. చికిత్సలో భాగంగా చిన్న చిన్న రంథాలున్న ఫొటోలను, వీడియోలను బాధితులకు చూపిస్తారు. వాటిని చూస్తున్నప్పుడు వారి ఫీలింగ్ ఎలా ఉంది. వారు వాటిని ఏ విధంగా భావిస్తున్నారనేది తెలుసుకుంటారు. నెమ్మది నెమ్మదిగా వాటిపై ఉండే భయాందోళనలను వారి మనసులో నుంచి తొలగిస్తారు. అంటే.. భవిష్యత్తులో అలాంటివి చూసినా, లైట్ తీసుకుంటారన్నమాట. ఈ ఫొబియా లేకున్నా మీరు ముఖ్యంగా తెలుసుకోవల్సింది ఏమిటంటే.. ఆ సమస్యతో ఉన్నవారిని హేళన చేయడం, విచిత్రంగా చూడటం వంటివి చేయకండి. పై చికిత్సలతో ట్రిపోఫోబియా నుంచి కోలుకొనేలా చెయ్యండి.
Also Read: వామ్మో, అతడి కడుపు నిండా గుట్టల గుట్టలు పాములు - ఎలా బయటకు తీశారో చూడండి