మనలో చాలా మందికి అరచేతులు ఎక్కువగా చెమట పడుతుంటాయి. దాని వల్ల ఎప్పుడు అవి తడిగా ఉంటూ కొంచెం ఇబ్బంది పెడతాయి. అలాంటి వాళ్ళు ఎదుటి వారితో కరచాలనం చేయడానికి ఇబ్బంది పడతారు. అలా ఉండటం వల్ల మీలోని ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది కూడా. కొంత మందిలో అయితే అరచేతులే కాదు అరికాళ్ళు కూడా చెమట పట్టి తడిగా ఉంటాయి. వాళ్ళు నడుస్తున్నపుడు కాలి ముద్రలు నేల మీద పడతాయి. అరచేతులు తడిగా ఉండటాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. మన స్వేద గ్రంధులు అతిగా చురుగ్గా ఉండటం వల్ల అరచేతులు తడిగా ఉంటాయి. దానికి శరీర ఉష్ణోగ్రత, బయట వాతావరణంతో సంబంధం లేదు. ఇదేమి ప్రమాదకరమైనది కాదు కానీ జన్యుపరంగా వచ్చే మధుమేహం, మెనోపాజ్, ఇన్ఫెక్షన్స్, గుండె పోటు వంటివి వచ్చేందుకు సంకేతాలుగా మనం గుర్తించాలి. దీన్ని తగ్గించుకునేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించి దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: హీరో విక్రమ్‌కు ఛాతీ నొప్పి? గుండె నొప్పి - ఛాతీ నొప్పి వేరు వేరా? ఏది ఏంటో ఎలా తెలుసుకోవాలి?
బేకింగ్ సోడా: ఇది మన ఇంట్లో దొరికే సులభమైనది. దీని ద్వారా మనం అరచేతుల చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీపెర్స్పిరెంట్‌గా చెమటని త్వరగా ఆవిరైపోయేందుకు బాగా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోదని నీటితో కలిపి పేస్ట్ చేసుకుని చేతులకి రుద్దుకోవాలి. దాన్ని ఐదు లేదా పది నిమిషాల పాటు ఉంచుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
యాపిల్ వెనిగర్: ఇది అందరి వంటింట్లో చాలా వరకు ఉంటుంది. ph లేవల్స్ సమతుల్యం చేసి అర చేతులు పొడిగా ఉండేలాగా చేస్తుంది. ఈ వెనిగర్ ని రాత్రి పడుకునే ముందు అరచేతులకి అప్లై చేసుకుని పొద్దున్నే నీటితో కడగటం చేయాలి. అలా చెయ్యడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also read: మగవారు జాగ్రత్త పడాల్సిందే, పెరిగిపోతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు
సెజ్ ఆకులు: సెజ్ ఆకులను మీ ఆహారంలో భాగం చేసుకోవడం లేదా వాటిని వేడి టీ లో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల అరచేతుల చెమటను తగ్గించుకోవచ్చు. ఎండి పోయిన సెజ్ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. ఇది చెమటను తగ్గించడంతో పాటు చేతుల నుంచి వచ్చే దుర్వాసన లేకుండా చేస్తుంది.
Also Read: డయాబెటిక్ రోగులకు గ్రీన్ టీ మంచిదేనా? తాగడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందా?