కార్తీకదీపం జులై 9 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam july 9 Episode 1400)
హిమను బయటకు గెంటేసిన తర్వాత పిన్ని చంద్రమ్మ-బాబాయ్ ఇంద్రుడికి జరిగినదంతా చెబుతుంది. వాళ్లు అంతలా బతిమలాడుతున్నారు వెళ్లొచ్చుకదా అని చంద్రమ్మ అనడంతో ఆ మాట అనొద్దు అంటుంది జ్వాల...
జ్వాల: మీరు కూడా వేరుచేస్తున్నారా, బంధాలు లేవు, అంతా స్వార్థపరులే..నాకు నా అనేవాళ్లు ఉన్నారో లేరో తెలియనప్పుడే , నా పేరోంటో కూడా చెప్పకపోయినా నన్ను దగ్గరకు తీసుకున్నారు, మీ బిడ్డలా చూసుకున్నారు. ఎప్పటికీ మిమ్మల్ని వదిలివెళ్లను అని చెబుతుంది.
చంద్రమ్మ: నువ్వు పెద్దింటి బిడ్డవి, పేదింట్లో పెంచాను ఇప్పటికైనా అక్కడకు వెళ్లమ్మా
జ్వాల: ఇల్లు పెద్దవే కానీ మనసులు ఇరుకు...మన ఇల్లులు ఇరుకైనా మనసులు పెద్దవి. ఇంకోసారి నన్ను మీరు వెళ్లమని అనొద్దు నేను మీతోనే ఉంటాను. నీళ్లు లేకుండా చేప బతకలేనట్టు..ప్రేమలేని దగ్గర నేను బతకలేను పిన్నీ
Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య
స్వప్న వంటచేస్తుండగా నిరుపమ్ అక్కడకు వెళతాడు.
నిరుపమ్: మనం ఇంకా పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు లేం. అలా చూస్తావేంటి..వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాం కానీ వంట సంగతేంటి. పెళ్లి గ్రాండ్ గా చేయాలి
స్వప్న: సరేలేరా
నిరుపమ్: సరే అంటావేంటి మమ్మీ...స్వప్న-సత్యం ఇంట్లో పెళ్లి ఇంత బాగా చేశారు అనుకోవాలి అంతా
స్వప్న: ఈ పెళ్లికి ఇంత హడావుడి అవసరమా
నిరుపమ్: హిమకు ఏమైనా అవుతుందని బాధపడుతున్నావా...హిమకు ఏమీ కాకుండా చూసుకుంటాను..ఇదంతా హిమపై జాలితో కాదు..ప్రేమతో చేస్తున్నాను
స్వప్న: రెండు నెలల్లో పోతుందనుకుంటే..దాన్ని బతికించుకుంటానంటున్నాను అంటాడేంటి..అదే జరిగితే హిమ పర్మినెంట్ గా నా కోడలు అయిపోతుంది.. అలా జరగడానికి వీల్లేదు...
అటు సౌందర్య ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఆనందరావుకి ఇస్తుంది..
ఆనందరావు: మనసు ప్రశాంతంగా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా..
సౌందర్య: హిమ ఇంకా ఇంటికి రాలేదు...శౌర్య మనసు మార్చి తీసుకొస్తానంది
ఆనందరావు: నేను పెద్దవాడిగా వెళ్లి అడిగాను..రాలేదు...ఇప్పుడు కూడా అంతే...హిమ నమ్మక ద్రోహం చేసిందని శౌర్య నమ్ముతోంది
సౌందర్య: అంత ప్రేమించే హిమను..అంతకుమించి ద్వేషిస్తోంది శౌర్య..
ఆనందరావు: హిమ ప్రయత్నం చేస్తోందే కానీ అది అయ్యే పనిలా కనిపించలేదు..టైం చాలా అయింది...ఓసారి హిమకు కాల్ చేయలేకపోయావా
సౌందర్య: చేస్తూనే ఉన్నాను స్విచ్చాఫ్ వస్తోంది..వర్షం ఎక్కువైందని ఎక్కడైనా ఆగిందేమో... మీరు ఎక్కువ ఆలోచించకండి..
Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్
అప్పుడే ఆటో చొక్కా వేసుకుని బయలుదేరుతున్నావ్...రెండు ముద్దలైనా తినేసి వెళ్లు అని ఇంద్రుడు-చంద్రమ్మ బతిమలాడుతారు. చాలా బావుంది దోసకాయ పచ్చడి తినివెళ్లు అని ఠక్కున ఇంద్రుడు అనడంతో పచ్చడే చేయాలా అని మండిపడుతుంది( దోసకాయ పచ్చడి అంటే హిమకు ఇష్టం). నేను తోడుగా రానా అని ఇంద్రుడు అంటే..డబ్బులేమైనా అవసరమా అంటుంది. వద్దులే అని చెప్పేసి డోర్ తీస్తుంది.... వర్షంలో బయట తడుస్తూ హిమ నిలబడి ఉంటుంది...
శౌర్య: ఏయ్ నువ్వేంటి ఇంటికి వెళ్లకుండా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా. నీకు పిచ్చెక్కిందా, వేషాలేస్తున్నావా
హిమ: వేషాలు, మోసాలు నాకు అలవాటు లేదు
శౌర్య: ఇలా చేస్తే జాలిపడతాను అనుకుంటున్నావా..ఇంటి ముందు నిల్చుని ఎవర్ని సాదిద్దామని..
హిమ: లోపలకు వెళదాం చాలా చలి వేస్తోంది...
శౌర్య: ఇంట్లోకి ఎందుకు..మీ ఇంటికే వెళదాం...
హిమ: నాపై కోపం పోవాలంటే ఒక్కసారి నేను చెప్పేది విను...
శౌర్య: నీ మాట వినేది లేదు..నా జీవితాన్ని నాశనం చేశావ్... ఇల్లెక్కడో చెప్పు దించేసి వస్తాను...
హిమ: మన ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నావా..ఇది ఎంత విచిత్రమో కదా
శౌర్య: ఇంతకన్నా విచిత్రాలు జీవితంలో చాలా జరిగాయి...మీ ఇంటికి దారి చెప్పు...ఇంకేం మాట్లాడకు...
స్వప్న-శోభ ఇద్దరూ డిస్కషన్ పెట్టుకుంటారు
స్వప్న: ఏం ఆలోచిస్తున్నావ్ మాట్లాడవేంటి
శోభ: మీరు చెప్పింది వింటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అసలు నిరుపమ్ అలా ఎలా ఆలోచిస్తున్నాడు
స్వప్న: ఏం చేసైనా హిమను బతికించుకుంటానంటున్నాడు
శోభ: బతికించుకోవడం ఏంటి..అది బతుకుతుంది..దానికి క్యాన్సర్ లేదు ..ఈ విషయం మీకు చెప్పలేను. హాస్పిటల్ అప్పులు తీర్చుదామని నిరుపమ్ ని పెళ్లిచేసుకుందాం అనుకున్నాను... ఇప్పుడు ఆ ఆశలేదు అనుకుంటూ... వెళతాను ఆంటీ నాకేం అర్థం కావడం లేదంటుంది... ( నిరుపమ్ ని దక్కించుకోవాలంటే నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది)
స్వప్న: ఈ శోభ ఏంటి ఇలా ఉంటుంది..ఈ మధ్య దీని ప్రవర్తన అస్సలు అర్థంకావడం లేదు...
Also Read:డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!
హిమను ఇంటి దగ్గర దించేసి లోపలకు వెళ్లకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోతుంది శౌర్య... పరాయిదానిలా అలా వెళ్లిపోతావేంటని హిమ చెబుతున్నా.. నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదంటుంది. నేను నిన్ను మోసం చేయలేదు నమ్ము అని హిమ చెప్పేందుకు ప్రయత్నించినా శౌర్య అస్సలు వినదు. హిమ: నువ్వు లోపలకు వస్తే నానమ్మ, తాతయ్యలు సంతోష పడతారు
శౌర్య: మీ సంతోషమే కానీ నా సంతోషం కోసం ఆలోచించడం లేదు. ఇక్కడి వరకూ వచ్చింది నీపై ప్రేమ, జాలి కాదు...మా ఇంటి ముందు దిష్టిబొమ్మలా నిల్చుంటే చూడలేక తీసుకొచ్చాను...
హిమ: నువ్వు రాకపోతే నేను ఈ ఇంటికి కూడా వెళ్లను ఇక్కడే ఇలా నిల్చుంటాను
శౌర్య: ఎవర్ని బెదిరిస్తావ్.... అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది... ఎపిసోడ్ ముగిసింది
సోమవారం ఎపిసోడ్ లో
శౌర్యను కలిసిన శోభ..హిమ గురించి మరింత నెగిటివ్ గా చెబుతుంది. నువ్వు డాక్టర్ సాబ్ ని ప్రేమిస్తున్నావ్ అని తెలిసిన తర్వాత తనకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుందంటుంది. శోభను లాగిపెట్టి కొడుతుంది శౌర్య. మరోవైపు జ్వరంతో ఉన్న శౌర్య దగ్గరకు కంగారుగా వస్తుంది హిమ....నేను మోసపోయాను పిన్నీ అని కలవరిస్తున్న శౌర్యని చూసి హమ బాధపడుతుంది...