దేవిని ఆదిత్య తన గదికి తీసుకెళ్ళి తనకి వచ్చిన ప్రైజ్ లన్నీ చూపిస్తూ సంబరంగా చెప్తాడు. నేను చెస్ స్టేట్ లెవెల్ ప్లేయర్ ని అని ఆదిత్య అంటే నేను చెస్ బాగా ఆడతాను నాకు స్కూల్ లో మస్త్ ప్రైజ్ లు వచ్చాయని దేవి చెప్తుంది. అయితే మనం ఇద్దరం పోటీ పెట్టుకుందామని అనడంతో దానికి దేవి సరే అంటుంది. ఇక రాధ జానకి అన్న మాటలు తలుచుకుని బాధపడ్తుతుంటే అక్కడికి రామూర్తి దంపతులు వస్తారు. పదేళ్ళ నుంచి జానకిని చూస్తున్నావ్ దాని మనస్తత్వం ఏమిటో నేకు తెలియదా ఏదో కోపంలో చిన్మయిని అలా మాట్లాడింది తప్పుగా అనుకోవద్దు అని సర్ధి  చెప్తాడు. ఈరోజు కాకపోతే రేపు అయినా నువ్వు వెళ్లిపోతాను అని చెప్తూనే ఉన్నావ్ అది మనసులో పెట్టుకుని నువ్వు ఈల్లు దాటిన మరుక్షణం నీమీద ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని భయంతో అది అలా మాట్లాడిందే తప్ప నీ మీద కోపంతో కాదని అంటాడు. నేను చిన్మయిని, దేవిని ఎప్పుడు వేరు వేరుగా చూడలేదమ్మా నాకు ఇద్దరు ఒకటే. . నువ్వన్నట్టుగా ఈ గడప దాటే పరిస్థితి వస్తే నీతో పాటు దేవి కూడా వస్తుంది. మీరిద్దరు వెళ్లిపోతే ఆ బాధని మర్చిపోవడానికి చాలా సమయం పడుతుందని జానకి చెప్తుంది. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవవద్దని రామూర్తి అంటాడు. నా బాధని చిన్మయి మీద కోపంగా చూపించాను అంతే కానీ పసిబిడ్డని దాన్ని బాధపెట్టాలనో నిన్ను బాధపెట్టాలనో నేను మాట్లాడలేదమ్మా అని జానకి రాధకి క్షమాపణలు చెప్తుంది. ఇక దేవి ఇంట్లో కనిపించకపోయేసరికి మాకు ఏదోలా ఉందని తనని త్వరగా పిలిపించమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. వాళ్ళ మాటలకి రాధ చాలా బాధపడుతుంది.  


Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్


ఇక ఆదిత్య వల్ల ఇంట్లో చెస్ ఆడుకునేందుకు దేవితో కలిసి ఆదిత్య కూర్చుంటాడు. ఆటలో దేవి ఒడిపోయేలా ఉండటంతో బాధగా కూర్చుంటుంది. అది చూసి ఆదిత్య ఓడిపోతావని భయంగా ఉందా అంటే లేదు నేను గెలుస్తానని దేవి అంటుంది. మా నాయన నేను కలసి మస్త్ సార్లు ఆడాం కానీ ఎప్పుడు నేనే గెలిచానని దేవి అంటే మాధవ కావాలని ఓడిపోతూ నిన్ను గెలిపిస్తున్నాడు, అది తప్పు మనం ఓడిపోతుంటే ఎందుకు ఓడిపోతున్నామని ఆలోచించి మన తప్పులని మనం సరిచేసుకోవాలి, అప్పుడు మనం ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటామని చెప్తాడు. ఆ మాటలకి దేవి ఈరోజు ఎలాగైనా నీతో చెస్ ఆడి గెలిచిన తర్వాతనే ఇంటికి పోతాను అని ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తుంది. భాగ్యమ్మ దేవి కోసం పండ్లు తెచ్చి ప్రేమగా తినమని చెప్పడం భాష, కమల చూస్తారు. దేవి మీద భాగ్యమ్మ చూపిస్తున్న అమితమైన ప్రేమను చూసి అనుమానపడతారు.


Also Read: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!


గుడి నుంచి దేవుడమ్మ బాధగా ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావమ్మా అని ఆదిత్య దేవుడమ్మని అడుగుతాడు. నాకు ఒక అమ్మాయి తిరుగు వాయనం ఇచ్చింది అది అని చెప్పాను కదా ఆ అమ్మాయి మన రుక్మిణి అని నాకు అనుమానం వచ్చింది అందుకని రుక్మిణి ఫోటో తీసుకుని పంతులకి చూపిద్దామని వెళ్లానని అంటుంది. ఆ మాటకి ఆదిత్య షాక్ అవుతాడు. కానీ గుడిలో ఆ ఫోటో కనిపించకుండా పోయిందని చెప్పి బాధపడుతుంది. నువ్వు కూడా రుక్మిణి గురించి అంతలా ఆలోచించకని తల్లికి చెప్తాడు. వస్తుంది.. వస్తుంది అని ఎన్ని రోజులు ఎదురు  చూడమంటావ్ అని ఆవేదనగా అదిత్యని అడుగుతుంది. మన అందరినీ చూడకుండా ఇన్ని రోజులు ఉందంటే దానికి బలమైన కారణం ఉండొచ్చు అదేంటో తెలుసుకుని మనం తనని ఇంటికి తీసుకు రావచ్చు అని చెప్తుంది.  కానీ తన గురించి ఏమి తెలియడం లేదని బాధపడుతుంది. మీరేం బాధకడకండి ఆంటీ నేను వెళ్ళి పూజారితో మాట్లాడతానని సత్య ధైర్యం చెప్తుంది. ఇక దేవుడమ్మ బాధగా అక్కడ నుంచి వెళ్లిపోగానే .. చూశావా సత్య రుక్మిణి ఫోటో తీసుకుని అమ్మ గుడికి వెళ్ళిందని అని ఆదిత్య అంటాడు. గుడిలో ఆ ఫోటో నేనే మిస్ చేశానని సత్య నిజం చెప్పడంతో ఆదిత్య షాక్ అవుతాడు.