ఉదయం ఎప్పుడూ ప్రెష్ గా, ఉత్సాహంగా మొదలవ్వాలి. సాధారణంగా అలాగే జరుగుతుంది చాలా మందికి కానీ కొందరికి అలా ఉండదు. ఉదయం లేవగానే తలనొప్పిగా ఉండడం వల్ల డల్ గా రోజు మొదలవుతుంది.  


కానీ ఇలాంటి తలనొప్పి కి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు పారాసిటమాల్ కూడా పెద్దగా పనిచెయ్యదు. ఉదయం లేచేసరికే తలనొప్పి ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి. వీటిలో చాలా వరకు అంత పెద్ద సమస్యలేమీ కాదు. అయితే ఇలా పదే పదే తలనొప్పి రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడం మంచిది కదా.


రాత్రి పార్టీ జరిగింది. ఉదయం తలనొప్పితో మొదలైంది. కారణం హ్యాంగోవర్ అని మనం ముద్దుగా పిలుచుకునే డీహైడ్రేషన్. పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకున్నపుడు కచ్చితంగా హ్యాంగోవర్ అవుతుంది. అందుకు కారణం శరీరంలో చేరిన ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కనుక ఆల్కహాల్ తీసుకున్న వారు దీన్ని తప్పించుకోవాలంటే తప్పకుండా ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎండ వల్ల, నీళ్లు తగినంత తాగకపోయినా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అది తలనొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి తలనొప్పి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కాసేపు ఇబ్బంది తప్ప దీనితో పెద్ద నష్టం లేదు. కానీ కొన్ని సార్లు  ఈనొప్పి అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి తలనొప్పి మాత్రం ఇంకేదైనా ఆనారోగ్యాన్ని సూచిస్తూ ఉండొచ్చు.


లక్షణాలు ఎలా ఉంటాయి?

తలనొప్పి చాలా రకాలుగా ఉంటుంది. నొప్పి ఎలా ఉంది? ఎంత తీవ్రంగా ఉందీ అనే దాన్ని బట్టి అది ఏరకమైన తలనొప్పి అనేది ఆధారఫడి ఉంటుంది.


మైగ్రేన్ – ఈ తలనొప్పి గుచ్చుకుంటున్నట్టు, కొడుతున్నట్టు ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడల్లా చాలా నీరసించి పోతారు. కొంత మంది డాక్టర్లు సూచించిన మందులు కూడా వాడక తప్పదు.


క్లస్టర్ – ఇది మంటగా ఉన్నట్టు ఉంటుంది. కళ్ల చుట్టూ మంటగా ఉంటుంది. కొన్ని సార్లు అసలు కళ్లు తెరవ లేరు కూడా.


సైనస్ – సైనస్ తలనొప్పి  ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ నొప్పి ముక్కు చుట్టూ, కళ్ల చుట్టూ, నుదుటి మీద ఉంటుంది.


ఎన్ని రకాల తలనొప్పి?

దాదాపుగా 300 రకాల తలనొప్పులు ఉన్నాయట. సాధారణంగా ఉదయం పూట మొదలయ్యే తలనొప్పి ఉదయాన్నే నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఉండొచ్చు. అందువల్ల నిద్రకు అంతరాయం అవుతుంది. నొప్పి వల్ల మెలకువ వస్తుంది.


ఇవి కాకుండా మరొ కొన్ని రకాల తలనొప్పులు ఉంటాయి. ఇవి కొన్ని రకాల మందులకు సైడ్ ఎఫెక్ట్స్ గా వస్తుంటాయి. కొన్ని అధ్యయనాలు నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఉదయం పూట తలనొప్పి తరచుగా కనిపిస్తుందని చెబెతున్నాయి.


కారణాలు ఏమిటి?

ఉదయంపూట తలనొప్పికి రకరకాల కారణాలు ఉన్నాయి.


షిప్ట్ వర్క్ – బాడీ క్లాక్ లో మార్పులు వల్ల కూడా తలనొప్పి వస్తుంది. వారం వారం షిఫ్ట్ మార్చి పనిచేసే వారిలో ఇలాంటి తలనొప్పి సాధారణమే. మీ బాడీ క్లాక్ ఒక విధంగా సెట్ అయ్యి ఉంటుంది. అందుకు భిన్నంగా మీ నిద్రపొయ్యే పాటర్న్ ఉన్నపుడు ఇలాంటిది జరుగుతుంది. లేదా బెడ్ రూమ్ లో ఉన్న అలర్జెన్స్ వల్ల కావచ్చు లేదా బెడ్ రూం చాలా చల్లగా ఉండటం వల్ల కూడా నిద్రకు అంతరాయం కలుగుతుంది. అది ఉదయాన్నే తలనొప్పికి కారణం అవుతుంది.


స్లీప్ డిజార్డర్స్

మెదడులోని నిద్ర, మూడ్ వంటి వాటిని కంట్రోల్ చేసే భాగమే నొప్పిని కూడా నియంత్రిస్తుంది. అందుకే ఉదయాన్నే మైగ్రేన్ ట్రిగర్ కావడానికి ఇన్సోమ్నియా అన్నిటికంటే పెద్ద కారణం. పని ఒత్తిడి కూడా తలనొప్పికి కారణం అవుతుంది. కొన్నిసార్లు బీపీ వల్ల కూడా ఇలా జరుగుతుంది.


కొన్ని చిన్న సూచనలు


మైగ్రేన్ నొప్పి కి కోల్డ్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. నుదుటి మీద కోల్డ్ ప్యాక్ ఉంచడం వల్ల నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.


టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పికి హీడ్ ప్యాడ్ మంచిది. తల, మెడ దగ్గర చాలా బాగా పనిచేస్తింది. హీట్ ప్యాడ్ సైనస్ తలనొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. ఆవిరి పట్టడం వల్ల కూడా సైనస్ నొప్పి నుంచి ఉపశమనం దొరకుతుంది.


జుట్టు గట్టిగా బిగుతుగా కట్టుకున్నా కూడా తలనొప్పి వస్తుంది. అది గమనించుకోవాలి. స్విమ్మింగ్ గాగుల్స్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు.


చాలా ప్రాకాశంతమైన లేదా మినుకు మినుకు మనే వెలుగు కూడా మైగ్రేన్ కు కారణం అవుతుంది. ఎండలో సన్ గ్లాసెస్ వాడడం, బెడ్ రూం చీకటిగా ఉండేలా చూసుకోవడం, కంప్యూటర్ స్క్రీన్ కూడా యాంటీ గ్లేయిర్ ఉండేలా జగ్రత్త పడాలి.


ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోకూడదు.