Sleeping After Romance | శృంగారం తర్వాత చాలామంది గాఢ నిద్ర వస్తుంది. అయితే, అది అలసట వల్ల వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ, దాని కథ వేరే ఉంది. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో సైన్స్, హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్‌ ప్రాజెక్ట్ ‘సైన్స్‌లైన్‌’కి చెందిన మెలిండా వెన్నర్ దీనిపై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘వరల్డ్ స్లీప్ డే’ నేపథ్యంలో.. శృంగారానికి నిద్రకు మధ్య ఉన్న లింక్ ఏమిటో తెలుసుకుందామా. 


చాలామంది పురుషులు శృంగారంలో పాల్గొన్న వెంటనే నిద్రపోతారు. ఈ పరిస్థితి మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది. పురుషులు శృంగార ఉద్వేగంతో స్కలించగానే.. కను రెప్పలు పడిపోతాయి. దీంతో స్త్రీలు, ఇంతేనా అని దిగులు చెందే సందర్భాలు చాలానే ఉంటాయి. దీనిపై చాలా ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. అయితే, ఇందులో పురుషులు తప్పేమీ లేదని, ఇందుకు వారి శరీరంలో జరిగే ప్రక్రియే కారణమని మెలిండా తెలిపారు.


శృంగారం తర్వాత మహిళలు కూడా నిద్రపోతారు. పురుషులతో పోల్చితే అది చాలా తక్కువ. శృంగారమనేది ఎక్కువగా రాత్రి వేళల్లోనే మంచం మీదే జరుగుతుంది. శృంగారంలో పురుషుల శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, శారీరకంగా అలసిపోతారు. కాబట్టి, శృంగారం తర్వాత వెంటనే నిద్రపోవడం సహజమే. చాలామంది ఇదే కారణమని కూడా అనుకుంటారు. అయితే, శాస్త్రీయంగా దీనికి అలసటతోపాటు మరో కారణం కూడా ఉందట. 


ఈ హర్మోన్లు, రసాయనాలే కారణం: శృంగారం సమయంలో స్త్రీ, పురుషుల్లో మరే ఆలోచన ఉండదు. కాబట్టి, అన్నీ మరిచిపోయి కళ్లు మూసుకోగానే నిద్రవచ్చేస్తుంది. అదే సమయంలో పురుషుల్లో శృంగారం వల్ల కలిగే ఉద్వేగం, స్కలనం వల్ల నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, నైట్రిక్ ఆక్సైడ్ (NO), ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌‌లు విడుదల అవుతాయి. ప్రొలాక్టిన్ విడుదల లైంగిక సంతృప్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రోలాక్టిన్ లోపం ఉండే పురుషుల్లో నిద్ర అంతగా రాదు. కాబట్టి, స్కలనం తర్వాత మళ్లీ మళ్లీ శృంగారంలో పాల్గొనే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. 


హస్త ప్రయోగం చేసినా ఇదే ఫలితం, కానీ..: నిద్రలో ప్రొలాక్టిన్ స్థాయిలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కొన్ని జంతువులను నిద్రపుచ్చేందుకు దీన్ని రసాయనంగా వాడతారు. కాబట్టి, శృంగారంలో ఉద్వేగం వల్ల హార్మోన్ విడుదలై పురుషులను నిద్రపోయేలా చేస్తుంది. అలాగే, హస్త ప్రయోగం చేసిన తర్వాత కూడా ఇదే ఫలితం ఉంటుంది. స్కలనం కాగానే చాలామందికి మాంచి నిద్ర వస్తుంది. ఇది క్రమేనా కొందరికి అలవాటుగా మారుతుంది. అయితే, హస్త ప్రయోగం వల్ల కలిగే భావప్రాప్తి కంటే సంభోగం సమయంలో కలిగే ఉద్వేగం వల్ల విడుదలయ్యే ప్రోలాక్టిన్ స్థాయిలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయని ఇటీవల ఓ అధ్యయనంలో పేర్కొన్నారు.  


Also Read: నిద్రపోకుండా ఎన్ని రోజులు బతకగలరో తెలుసా?


ఇది సహజ ప్రక్రియే..: శృంగార సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే రెండు ఇతర రసాయనాలు కూడా నిద్రతో సంబంధం కలిగి ఉంటాయట. ఆక్సిటోసిన్ ఒత్తిడి స్థాయిలను తగ్గించి విశ్రాంతి లేదా నిద్రకు ఉపక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. శృంగారం తర్వాత నిద్ర అనేది సహజసిద్ధమైనేదనని, అది మంచి అలవాటేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, దీన్ని లోపంగా భావించవద్దని అంటున్నారు. శృంగారం వల్ల అలసిన శరీరం తిరిగి శక్తిని పుంజుకోడం కోసం నిద్రకు ప్రేరేపిస్తుందట. అందుకే, కొందరు రాత్రి మంచిగా నిద్రపోయి.. తెల్లవారుజామున కూడా ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు. ఇటీవల యూకేలో 10 వేల మంది పురుషులపై జరిపిన సర్వేలో 48 శాతం మంది శృంగారం తర్వాత నిద్రపోతామని చెప్పారట. చూశారుగా, మీకు సరిగా నిద్ర పట్టకపోతే.. శృంగారం చేయండి. ఎందుకంటే నిద్ర ఆయుష్షు పెంచుతుంది. మిమ్మల్ని రోజంతా తాజాగా, యాక్టీవ్‌గా ఉంచుతుంది. ‘హ్యాపీ స్లీప్ డే’.


Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు