న్నో పోషకాలు అందించే పెరుగును ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పులిసిన పెరుగుతో చద్దన్నం కలుపుకుని అందులో కొద్దిగా ఆవకాయ నంచుకుని తింటుంటే భలే రుచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీ లేదా ఏ నాన్ వెజ్ వంటకం అయినా కూడా పులియబెట్టిన పెరుగు లేకుండా చేయలేరు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు పెరుగు దోహదపడుతుంది. పెరుగు రుచి దాని ఉష్ణోగ్రత, సీజన్, సిద్ధం చేసేందుకు పట్టే సమయం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. భారతీయులు పెరుగుతో భోజనం ముగించనిదే అన్నం తిన్న తృప్తి ఉండదు. అందుకే తప్పనిసరిగా అందరి ఇళ్ళల్లో పెరుగు ఉంటుంది.


పెరుగు ఎలా, ఎప్పుడు, ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం మీద తప్పకుండా అవగాహన ఉండాలి. విరుద్ధమైన ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తీసుకోవడం వల్ల అది ఆరోగ్యానికి హాని కూడా చేస్తుంది. అందుకే ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి.


ఎలాంటి పెరుగు తినాలి?


అసంపూర్తిగా ఏర్పడిన పెరుగు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణం కావడం కష్టం. ఇది వివిధ వ్యాధులకి కారణం అవుతుంది. పూర్తిగా ఏర్పడిన పెరుగు తీపి, కొద్దిగా పుల్లగా ఉంటుంది. దీని రుచి వాతావారణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. వాతావారణం వేడిగా ఉంటే పెరుగు త్వరగా పులిసిపోతుంది.


పుల్లటి పెరుగు తినకూడదు


ఒకటి లేదా రెండు రోజులు పెరుగు బయట ఉండటం వల్ల అది బాగా పులిసిపోతుంది. అలా విపరీతమైన పుల్లటి పెరుగు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. శరీరంలో పిత్త దోషాన్ని పెంచుతుంది. కడుపులో మంటని కలిగిస్తుంది.


పెరుగు ఎలా తీసుకోవాలి?


పెరుగుని ఎలా తినాలనే దాని గురించి ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. పెరుగు తినేందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.


⦿ రాత్రి తినాలి


⦿ పెరుగు వేడి చెయ్యకూడదు


 ⦿వేడిగా ఉన్న ఏ పదార్థంతోనూ కలపకూడదు


⦿ వేసవి, వసంత, శరదృతువుల్లో పెరుగు తినకూడదు


⦿ పంచదార, ఉప్పు, తేనె, నెయ్యి, జామకాయ లేదా పచ్చి శెనగపిండితో కలిపి తినాలి


పెరుగుతో కలిపి తీసుకోకూడని ఆహారాలు


విరుద్ధమైన ఆహారాలతో కలిపి పెరుగు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చేపలు, పాలు, ఇతర పుల్లని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. వాత, పితా, కఫా అనే మూడు దోషాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడే అంశాలు. పెరుగు శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది కానీ కఫాన్ని పెంచుతుంది. పుల్లగా ఉంటే అది పిత్తని కూడా పెంచుతుంది. కఫా పెరుగుదల మధుమేహం, దగ్గు, ఉబ్బసంతో పాటు అనేక రకాల వ్యాధులకి దారితీస్తుంది. పిత్త పెరుగుదల వల్ల పొట్టలో పుండ్లు, రక్త స్రావం, చర్మ రుగ్మతలు వంటి సమస్యలు ఎదురవుతాయి.


ఈ సమస్యలు ఉంటే వద్దు


విరుద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియకి ఆటంకం, చర్మ వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. విరోచనాల సమయంలో పెరుగు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బాధకరమైన మూత్ర విసర్జన, ఆమెనోరియా, నిద్రలేమి, కొన్ని రకాల గుండె జబ్బుల వాళ్ళు పెరుగు తీసుకుంటే చాలా మంచిది. అదే విధంగా రక్తస్రావం, కఫా వ్యాధులు, చర్మ రుగ్మతలు, వాపు, మధుమేహం, నోరు, గొంతు వ్యాధులు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం.ః


Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం



Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది 



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.