డయాబెటిస్ చాప కింద నీరులా పాకిపోతోంది. దీన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల ప్రధాన అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉంది. డయాబెటిస్ ముఖ్యంగా మూడు రకాలు టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్. కానీ ప్రపంచానికి పెద్దగా తెలియని మరో రకం కూడా ఉంది, అదే టైప్ 3సి డయాబెటిస్. ఇది చాలా అరుదైనది. శరీరంలో ప్యాంక్రియాస్ దెబ్బతినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. కొందరికి ప్యాంక్రియాస్ పాక్షికంగా తొలగించినప్పుడు కూడా ఈ డయాబెటిస్ వచ్చే ఛాన్స్ పుష్కలం. ఈ డయాబెటిస్ బారిన పడిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. 


ఏం జరుగుతుంది?
ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు లేదా పాక్షికంగా దాన్ని  తొలగించినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇన్సులిన్ అనేది రక్తంలోని గ్లూకోజ్‌ను కణాలు శక్తిగా స్వీకరించేలా చేసే హార్మోన్. ఇలా ఇన్సులిన్ ఉత్పత్తే ఆగిపోతే కణాలు శక్తిని గ్రహించలేవు. దీని వల్ల శరీర జీవక్రియలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ డయాబెటిస్ రకాన్ని చాలా మంది టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌గా భావిస్తారు. టైప్ సి3 డయాబెటిస్లో ప్యాంక్రియాస్ ఆహారాన్ని జీర్ణం చేస్తే ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడాన్ని కూడా ఆపివేస్తుంది. ఈ మధుమేహం రావడానికి కారణం పూర్తిగా ప్యాంక్రియాస్ ఆరోగ్యస్థితే. 


టైప్1, టైప్2 డయాబెటిస్ రకాలతో పోలిస్తే దీని లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. 


1. డయేరియా
2. కడుపు నొప్పి
3. జిగట విరేచనాలు
4. హఠాత్తుగా బరువు తగ్గడం
5. అతిగా అలిసిపోవడం
6. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం
7. ఆహారానికి బదులు అధికంగా గాలిని మింగేయడం


టైప్ సి3 మధుమేహం వల్ల  రక్తంలో గ్లూకోజ్ హెచ్చు తగ్గులు వస్తుంటాయి. కొన్ని రకాల మందులు వాడడం, విపరీతమైన ఒత్తిడి, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు,సర్జరీలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. ఇది వస్తే జీవితాంతం తగ్గదు.  దీన్ని చాలా మంది టైప్ 2 డయాబెటిస్ గానే పరిగణిస్తారు. నిజానికి ఈ రెండూ వేరు వేరు. 


ఏ రకం డయాబెటిస్‌నైనా కంట్రోల్ చేయకపోతే త్వరగా మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 


Also read: మీకు లో బీపీ ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు



Also read: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?