శారీరక విధుల్లో కొలెస్ట్రాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దాని స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడితే మాత్రం అది మొత్తం ఆరోగ్యంపైనే ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా హృదయనాళ ఆరోగ్యం మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని అంచనా వేయడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలని సాధారణంగా డెసీలీటర్ కు 200 మిల్లీగ్రాముల((mg/dL) కంటే తక్కువగా పరిగణిస్తారు. అయితే ఈ సంఖ్య హృదయ నాళ ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేదు.


HDL కొలెస్ట్రాల్


HDL కొలెస్ట్రాల్ ని తరచుగా మంచి కొలెస్ట్రాల్ గా సూచిస్తారు. ఎందుకంటే ఇది రక్తప్రవాహం నుంచి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడుతుంది. దాన్ని తొలగింపు కోసం కాలేయానికి తీసుకుని వెళ్తుంది. HDL కొలెస్ట్రాల్ అధిక స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 60 mg/dL లేదా అంతకంటే ఎక్కువ HDL కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటే  హృదయ ఆరోగ్యానికి కావాల్సిందిగా పరిగణిస్తారు.


LDL కొలెస్ట్రాల్


ధమనుల్లో ఫలకం మాదిరిగా ఏర్పడుతుంది. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఫలకం పేరుకుపోవడం వల్ల అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 100 mg/dL కంటే తక్కువ LDL కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వారు తక్కువ ప్రమాదం ఉన్నట్టు అర్థం. దీని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ కరిగించుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే అది గుండె మీద ప్రభావం చూపుతుంది.


ట్రైగ్లిజరైడ్స్


రక్తప్రవాహంలో కనిపించే ఒక రకమైన కొవ్వు ఇది. ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగితే హృదయనాళ ప్రమాదంతో సంబంధం కలిగి ఉంటుందని అర్థం. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు 150 mg/dL కంటే తక్కువగా ఉండాలి. 200 mg/dL కంటే ఎక్కువ స్థాయిలు  ఉంటే ప్రమాదకర పరిస్తితులో ఉన్నట్టు అర్థం. ట్రైగ్లిజరైడ్ స్థాయిలు ఆహారం, శారీరక శ్రమ, మద్యపానం, అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల వంటి కారణాల వల్ల ప్రభావితమవుతుంది.


ఎలా చెక్ చేసుకోవాలి?


మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలో మంచి కొలెస్ట్రాల్ నిష్పత్తి 4:1 కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తక్కువగా సూచిస్తుంది. 5:1 కంటే ఎక్కువ నిష్పత్తి ఉంటే అధిక ప్రమాదాన్ని కలిగి ఉన్నారని సూచిక. కొలెస్ట్రాల్ స్థాయిలు కుటుంబ చరిత్ర, ధూమపానం, రక్తపోటు, మధుమేహం వంటి ఇతర ప్రమాద కారకాలని బట్టి పరిగణలోకి తీసుకుంటారు.


అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు


కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించుకునేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. శారీరక శ్రమలో పాల్గొనడం, ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, ధూమపానం, మద్యపానం పరిమితం చేయడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలని సమర్థవంతంగా నిర్వహించడంలో మందులు సూచించబడతాయి. స్టాటిన్స్, ఫైబ్రేట్స్ ఇతర లిపిడ్ తగ్గించే మందులు LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి HDL కొలెస్ట్రాల్‌ను పెంచడానికి ఉపయోగపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: వర్షాకాలంలో రోగాల బారిన పడకూడడంటే ఈ ఎనిమిది జాగ్రత్తలు తప్పనిసరి


Join Us on Telegram:https://t.me/abpdesamofficial