Lose Weight Fast : జిమ్​లకు వెళ్లలేని వారు బరువు తగ్గేందుకు ఎంచుకునే సులభమైన పద్ధతి వాకింగ్. వ్యాయామాలు చేయలేనివారు కూడా వాకింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు ట్రై చేస్తారు. అలా మీరు కూడా వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే.. వాకింగ్​ ఎంత సేపు చేస్తే శరీరంలో కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుందో తెలియాలి. అది తెలియకుండా మీకు తోచినంత సేపు చేస్తే.. మీరు వాకింగ్ చేసినా బరువు తగ్గడం కష్టమవుతుంది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం వాకింగ్​ని ఎన్ని నిమిషాలు చేస్తున్నామనేదానికి అన్ని ప్రయోజనాలు యాడ్ ఆన్ అవుతాయట. ఎలా అంటే ఓ నిమిషం నడిచారనుకో దానికి తగ్గ బెనిఫిట్స్ ఉంటాయి. 5 నిమిషాలు వాక్ చేస్తే దానికి తగిన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా కొన్ని నిమిషాలు కచ్చితంగా వాక్ చేయాలంటున్నారు. మరి శరీరంలోనే కొవ్వును కరిగించేందుకు ఎంత సేపు వాక్ చేయాలో.. నిపుణులు వాకింగ్​తో బరువు తగ్గేందుకు ఇచ్చే ప్రో టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఒత్తిడి, మధుమేహం కంట్రోల్ అయ్యేందుకు.. 

మీరు ఓ నిమిషం నడిచారంటే.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుందంట. అదే మీరు 5 నుంచి 10 నిమిషాలు నడిస్తే మీ మూడ్​ రిఫ్రెష్ అవుతుందట. శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించి.. ప్రశాంతతను అందిస్తుంది. కాబట్టి మీరు ఒత్తిడికి గురైనప్పుడు మూడ్​ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఓ పది నిమిషాలు వాక్ చేసేయండి. మీరు 15 నిమిషాలు వాకింగ్ చేస్తే.. రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. మధుమేహమున్నవారు దీనిని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. 

బరువు తగ్గడానికి నడవాల్సిన నిమిషాలు.. 

అరగంట వాక్ చేస్తే.. శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గాలనే గోల్​లో ఉండేవారు ఈ విషయం తెలుసుకోవాలి. అలా అని 30 నిమిషాలు వాక్ చేస్తే సరిపోదు. కొవ్వు కరగడం ప్రారంభ సమయం కాబట్టి.. దానికంటే కాస్త ఎక్కువగా నడిచేందుకు ప్రయత్నించాలి. అయితే బరువు తగ్గడంతో పాటు ఓవర్​ థింకింగ్​ని దూరం చేసుకోవాలనుకుంటే 45 నిమిషాలు వాక్ చేయాలి. అదే గంట నడిస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది శారీరకంగా, మానసికంగా కూడా మెరుగైన ఆరోగ్యాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది.  

బరువు తగ్గాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన ప్రో టిప్

మీరు వాకింగ్​తో బరువు తగ్గాలనుకుంటే పైన చెప్పిన సమయాన్ని ఫాలో అవ్వడంతో పాటు.. మరో సింపుల్​ టిప్ ఫాలో అవ్వాలి. మీరు లంచ్, డిన్నర్ లేదా ఏదైనా హెవీ మీల్ తీసుకున్న తర్వాత వెంటనే ఓ పది నిమిషాలు వాకింగ్ చేయండి. ఇది మీకు బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవ్వడమే కాకుండా తీసుకున్న ఆహారం శరీరానికి అందుతుంది. గట్ హెల్త్ మెరుగై బరువు తగ్గడం సులభమవుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.